ఏపీ రాజ‌కీయాల్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. జ‌గ‌న్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. ఈ టైంలో ప్ర‌ముఖ సినీన‌టుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి ఆయ‌న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. 


ఇక చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ్ అయ్యి మంచి ప్ర‌శంస‌లు పొందుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ర్నూలు జిల్లా ఉయ్యాల‌వాడ‌కు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా చిరంజీవి చేసిన న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చిరు ఈ సినిమాకు మ‌రింత‌గా ప్ర‌మోష‌న్ చేసి... జ‌నాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప‌లువురు రాజ‌కీయ‌, సినిమా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను సైతం ఆహ్వానిస్తున్నారు.


ఈ క్ర‌మంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని సైతం  ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు.


ఇక ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ అభిమానులు జ‌గ‌న్‌ను బాగా టార్గెట్ చేశారు. అటు ప‌వ‌న్ సైతం జ‌గ‌న్‌తో పాటు వైసీపీని తీవ్రంగా విమ‌ర్శించారు. ఎన్నిక‌లు అయ్యాక కూడా జ‌గ‌న్‌పై ప‌వ‌న్ తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిరుకు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: