దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఈ బ్యాంకు ఖాతా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అయితే ఈ బ్యాంకు ఏటీఎం క్యాష్ విత్ డ్రా సేవలు విచిత్రం. ఈ బ్యాంక్ కస్టమర్లు ప్రతి నెల పరిమిత సంఖ్యలో మాత్రమే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆలా కాదని పరిమితి దాటితే చార్జీలు భారీగా పడుతాయి. 


అయితే ఏటీఎం పరిమితి దాటిన తర్వాత కూడా పడకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఒకటి ఉంది. అదే యోనా కార్డ్ లెస్ విత్‌డ్రాయెల్స్. బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్ సాయంతో డెబిట్ కార్డు లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఈ యోనో యాప్ ఇస్తుంది. ఏటీఎం లావాదేవీల పరిమితికి ఇవి అదనం. అయితే యోనో యాప్‌తో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.


గూగుల్ ప్లేస్టోర్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అనంతరం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఏటీఎం కార్డు లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.


రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 6 నెంబర్ల ఎంపిన్‌ను సెట్ చ్చేసుకోవాలి. ఈ 6 నెంబర్ల ఎంపిన్‌ సాయంతో యాప్‌‌లోకి లాగిన్ అవ్వాలి. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో కూడా లాగిన్ కావొచ్చు.  


యాప్‌లోకి లాగిన్ అయిన అనంతరం యోనో క్యాష్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోండి. రిక్వెస్ట్ టు యోనో క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


ఇప్పుడు యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. 


పిన్ ఆరు అంకెలు, యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్‌లో కూడా ఆరు అంకెలు ఉంటాయి.


ఈ నెంబర్లు నోట్ చేసుకొని దగ్గరిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. 


యాప్‌లోనే దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్ తెలుసుకోవచ్చు. 


ఏటీఎం స్క్రీన్‌పై యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి తర్వాత యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. 


ఆతర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత యోనో క్యాష్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం మీకు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. 


చూశారుగా .. ఎక్కువ సార్లు విత్ డ్రా చేసిన చార్జీలు పడకుండా ఉండేందుకు ఈ యెనో యాప్ ని ఉపయోగించండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: