దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ నెలకొంది.  పేరు లో జాలి ఉన్నా ఏమాత్రం జాలీ దయా లేకుండా అత్తారింటిని సర్వనాశనం చేసింది.  భర్త, అత్తమామలను సైనెడ్ తో చంపింది..తాను కోరకున్న ప్రియుడి కోసం అతని భార్య, కూతురిని దారుణంగా హతమార్చింది.  అయితే ఈమె హత్యా ఉదాంతాలు బయటపడతాయని అత్త సోదరుడుని కూడా హతమార్చింది.  ఇలా ఒక్కొక్కరినీ పద్నాలు సంవత్సరాల్లో ఆహారంలో సైనెడ్ కలిపి చంపేసింది జాలి అనే మహిళ.

  అయితే తన తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్యలది సహజమరణం కాదని..తన వొదిన ప్లాన్ చేసి చంపిందని అమెరికాలో ఉంటున్న మొదటి భర్త రాయ్‌ థామస్‌ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె నిజస్వరూపం బయట పడింది. 2002 సంవత్సరంలో ఆమె ఒక్కొక్కరినీ చంపడం మొదలు పెట్టింది.  రెండు మూడేళ్లు గ్యాప్ ఇస్తూ తనకు అడ్డుగా ఉన్నవారందరినీ హతమార్చింది.  కేరళలోని కోజికోడ్‌లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన నిందితురాలు జాలీ మరికొన్ని హత్య కేసుల్లోనూ నిందితురాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జాలీ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంది. ఆమెకు మానసిక రుగ్మత ఉండటం వల్ల ఈ దారుణాలకు పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే..సమీప బంధువులు మాత్రం ఆమె కామ వాంఛతో తన భర్త సోదరుడి ప్రేమలో పడి ఇలా చేసిందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ జాలీ మొదటి భర్త సోదరుడు ఇక్కడే ఉంటే అతన్ని కూడా హతమార్చేదని అంటున్నారు. అయితే జాలీ కేవలం ఈ ఆరు హత్యలతో మాత్రమే కాదు..మరికొన్ని హత్యలతో సంబంధం ఉందని అంటుంది మొదటి భర్త రాయ్‌ థామస్‌ సమీప బంధువు ఎల్సమ్మ. 

తాజాగా ఆమె మాట్లాడుతూ..2002లో ఎల్సమ్మ కుమారుడు సునీష్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ ప్రమాదం జాలీనే చేయించిందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అంతే కాదు విన్సెంట్‌ అనే వ్యక్తి ఆత్మహత్య వెనుక కూడా జాలీ హస్తం ఉందని ఎల్సమ్మ తెలిపింది. స్థానిక కాంగ్రెస్ నేత రామకృష్ణ హత్య వ్యవహారంలో జాలీతో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదైనట్లు ఎల్సమ్మ పేర్కొంది. ఆమె చెప్పిన విషయాల ఆధారంగా ఆ కేసులపై పునర్విచారణ చేపడతామని ఎస్పీ కేజీ సిమోన్‌ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: