ఫిమేల్ మాగజైన్ అనే సంస్థ సెక్స్ అండ్ రిలేషన్ షిప్ పేరిట చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇంగ్లండ్ లో జరిపిన సర్వేలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు పరపురుషుడితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్నవారే అని తెలిసింది. 47 శాతం మంది పరపురుషులకు ఈ మహిళలు మోసం చేస్తున్నారనే విషయం కూడా తెలియదట. పరపురుషుడితో సంబంధాలు పెట్టుకున్న మహిళల భర్తల్లో 50 శాతం మంది భర్తలకు కనీసం ఆ మహిళలపై అనుమానం కూడా లేదని సర్వేలో వెల్లడైంది. 
 
ఫిమేల్ మేగజైన్ 1000 మంది అన్ని వయస్సుల మహిళలపై సర్వే చేయగా వారు తమ సెక్స్ జీవితాల గురించి చెప్పారు. స్టిఫానీ అనే మహిళ పరపురుషుడితో పడక సుఖం థ్రిల్లింగానే ఉందని అయినా భర్తను వదిలిపెట్టాలన్న ఉద్దేశం లేదని అది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. ఇంగ్లండ్ లోని ప్రముఖ సైకో థెరపిస్ట్ లూసీ బెరస్ ఫోర్డ్ వివాహ బంధం లేని ఏ ఎఫైర్ లోనైనా థ్రిల్లింగ్ ఉంటుందని చెప్పారు. 
 
భార్యలు పెళ్లి బంధంతో నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తారని అందువలన వారు పరపురుషులతో ఎక్కువ ఆనందంగా గడుపుతారని చెప్పారు. మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకోవటానికి భర్త పట్ల ప్రతీకారం, కోపం జీవితం మీద ఉన్న అసహనం, అసంతృప్తి కారణమని చెప్పారు. లండన్ కు చెందిన రాచెల్ అనే 38 సంవత్సరాల మహిళ ఆఫీసు పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు ఏర్పడిన పరిచయాలు సెక్స్ సంబంధాలకు దారి తీశాయని చెప్పారు. 
 
ఈ విషయం తన భర్తకు తెలిసి విడిపోవాల్సి వచ్చిందని రాచెల్ చెప్పారు. భర్తతో విడిపోయినందుకు తనకు బాధగా లేదని రాచెల్ అన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో ఎక్కువమంది తమ భర్తలను వదిలేసే ఉద్దేశం మాత్రం లేదని చెప్పారు. పరపురుషులతోనే సెక్స్ అనుభూతి బాగుందని ఈ మహిళలు చెప్పటం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: