ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెగా ఉన్నది కాస్తా 'సకల జనుల సమ్మెగా" మారాల్సి ఉందని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు.సకల జనుల సమ్మె.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత ప్రధాన పాత్ర పోషించింది.  తెలంగాణ  రాష్త్ర  ప్రజలంతా  ఈ సమ్మెలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్నీ ఈ సకల జనుల సమ్మె ఏకం చేయనుంది.

సకల జనుల సమ్మె ఎంత ఉధృతంగా అప్పట్లో సాగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, ఇప్పుడు సకల జనుల సమ్మెకి  అంతా సిద్ధం అయింది . రేపో మాపో ప్రకటన కూడా చేయబోనుంది. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనుల సమ్మె ప్రారంభం కానుంది అని  తెలిపారు.సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారు.

ఆర్టీసీ కార్మికులు  ప్రభుత్వం ముందు వాళ్ళ  డిమాండ్లు వుంచడం అనేది ఎప్పటి నుండో   జరుగుతూ వస్తుంది . ఆర్టీసీ లాభ నష్టాలకు ప్రభుత్వానిదే  పూర్తి బాధ్యత.. అంటున్నారు  కార్మిక సంఘాలు. గతంలో, ఆర్టీసీ డిమాండ్లు న్యాయబద్ధమైనవని కేసీఆర్‌ చెప్పగా , ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్ని అభివృద్ధి నిరోధకులుగా  పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే కొనసాగిస్తున్న సమ్మెని, మరింత  బలపరుస్తూ ఉధృతం చేయాలనుకుంటున్నారు.ఒక్క ఆర్టీసీ కార్మికులే కాదు, టీచర్లు  తో సహా ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి  పొందుతున్న వివిధ సంఘాల్ని కలుపుకొని , సకల జనుల సమ్మె చేపట్టే దిశగా రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి,వారు  కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

అయితే, సకల జనుల సమ్మె వెనకాల అప్పట్లో కేసీఆర్‌ వున్నారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లో, కోదండరామ్‌ నేతృత్వంలో సకల జనుల సమ్మె అప్పట్లో చాలా ఉధృతంగా నడిచింది. కానీ, ఇప్పుడు పరిస్థితే  వేరు. తెలంగాణలో కేసీఆర్‌ ఏది చెబితే అదే చట్టం.కేసీఆర్‌ ఎవరిని పొగిడితే ,అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకోవాలి. కేసీఆర్‌ ఎవరిని తిడితే.. అందరూ ఆ వ్యక్తిని దూషించాలి.ఇది ఈమధ్య  మొదలయింది కాదు  గత  కొన్నేళ్ళుగా తెలంగాణలో సాగుతూ వస్తుంది . ఈ క్రమంలో  సకల జనుల సమ్మె.. అంటూ ఆర్టీసీ కార్మికులు కావొచ్చు, ఇంకెవరైనా  కావొచ్చు.. ఎంత చేసినా  ప్రయోజనం శూన్యమే  అంటున్నారు  రాష్ట్ర ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి: