అతను అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతని పనేంటి ఎవరైనా కస్టమర్లు ఏదైనా ఆర్డర్  చేస్తే వాటిని జాగ్రత్తగా కస్టమర్లకు  డెలివరీ చేయడం... కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు తమకు  నచ్చకపోతే రిటర్న్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అవి వచ్చి  పికప్ చేసుకో వడం. కానీ చేయాల్సిన పని మానేసి... మహిళా కస్టమర్ కనిపిస్తే హిప్నటైజ్ చేసే వారిపై అత్యాచారం చేయటమే పనిగా  మార్చుకున్నాడు ఆ డెలివరీ బాయ. ఇలాగే ఓ మహిళపై అత్యాచారం చేయబోయాడు కానీ ఆమె తప్పించుకోవటం తో ఈ డెలివరీ బాయ్ అసలు గుట్టురట్టయింది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 

 

 

 

 ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఓ మహిళ అమెజాన్ లో  5 బాక్సులని ఆర్డర్  చేసింది. అయితే అవి డెలివరీ అయిన తర్వాత పార్సిల్  ఓపెన్ చేసి చూస్తే నచ్చకపోవడంతో మళ్ళి రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది ఆ మహిళ. ఈ నేపథ్యంలో వాటిని తీసుకునేందుకు ఆ మహిళా ఇంటికి డెలివరీ  వచ్చాడు. అయితే ఆ బాక్స్ లను  పికప్ చేసుకోవడానికి వచ్చిన డెలివరీ బాయ్... నాలుగు బాక్సులు మాత్రమే వెనక్కి తీసుకుంటానని తనకు  అలాగే ఆర్డర్ ఉందని  తెలిపాడు . దీంతో డెలివరీ బాయ్ కి మహిళలకు కాస్త వాగ్వాదం జరిగిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ  డెలివరీ బాయ్. తర్వాత ఆ మహిళా అమెజాన్  కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయం వివరించగా... ఐదు బాక్సులు  తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి ఆ మహిళకు తెలిపాడు. ఇంతలోనే బాక్స్ లు  తీసుకెళ్ళకుండా వెళ్ళిన డెలివరీ బాయ్ మళ్లీ వచ్చి బాక్సులు తీసుకుంటాను  అని చెప్పాడు . 

 

 

 

 

 

 దీంతో అనుమానం కలిగిన మహిళ కస్టమర్ కేర్ ప్రతినిధి వేరే వ్యక్తిని  పంపిస్తామని చెప్పారని... నీకు ee బాక్సులు  ఇవ్వనని ఆ డెలివరీ బాయ్ తో తెగేసి చెప్పేసింది ఆ మహిళ. అయితే మళ్ళీ తిరిగి వచ్చిన డెలివరీ బాయ్ మహిళలకు హిప్నటైజ్ చేయటంతో  స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆ మహిళపై అత్యాచార యత్నం చేసేందుకు డెలివరీ బాయ్ ప్రయత్నించాడు ...ఇంతలో  హైప్నోటైస్  నుంచి బయటకు వచ్చిన ఆ మహిళకు... ఆ డెలివరీ బాయ్ ఆమెపై  అత్యాచారం చేసేందుకు  ప్రయత్నం చేస్తున్నట్లు గ్రహించింది దీంతో భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేయడంతో ఆ డెలివరీ బాయ్ పారిపోయాడు. దీంతో జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: