చంద్రబాబుకు ఎందుకో అసహనం కట్టలుతెచుకుంటోంది. వయసు మీదపడిన ప్రభావం చాలాకాలంగా ఉంది. దానికి తోడు పార్టీ ఎన్నికల్లో ఘొరంగా ఓడిపోవడం, జగన్ సర్కార్ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతూండడం వంటి కారణాల వల్ల చంద్రబాబు తన అసహనం ఎక్కడా దాచుకోలేకపోతున్నారు. అప్పట్లో అన్న నందమూరి ఈ వయసులో ఉన్నపుడే నయం. బాబు కంటే ఓపికగా మాట్లాడేవారని టీడీపీలో కురువ్రుధ్ధులు అంటున్నారంటే బాబు ఎంతటి అసహనశీలో అర్ధమవుతోందిగా.


విశాఖ జిల్లాలో పార్టీకి రిపేర్లు చేసుకోవడానికి ఈ రోజు నగరానికి వచ్చిన చంద్రబాబు పోలీసులపైన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విశాఖ విమానాశ్రయం నుంచి దాదాపు పది కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న టీడీపీ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్తమని తమ్ముళ్ళు పట్టుపట్టారు. నగరంలో ఉ\దయం పది తరువాత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పైగా ముందస్తుగా అనుమతులు కూడా తీసుకోలేదు.


దాంతో పోలీసులు ససేమిరా అనేశారు. దాంతో బాబుకు కొపం కట్టలు తెంచుకుంది. పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగులో ఆయన మాట్లాడుతూ పోలీసులు మరీ అతి చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఓవరాక్షన్లు మా వద్ద చూపించకండి అంటూ గట్టిగానే మాట్లాడారు. పోలీసులు అధికార వైసీపీకి కొమ్ము కాస్తున్నారని కూడా బాబు హాట్ కామెంట్స్ చేశారు. మీకు అంతలా వైసీపీ పార్టీ నచ్చితే ఆ పార్టీలో చేరిపోండి తప్ప పోలీస్ డ్రస్ లో ఉండి టీడీపీని వేధిస్తామంటే వూరుకోబోమని హెచ్చరించారు.


ఇది బాగానే ఉంది కానీ తెలుగుదేశం పాలనలో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించారని చెబుతున్నారు. ఆనాడు అనుమతులు లేని ప్రతిపక్ష ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని, మరి అపుడు చంద్రబాబుకు పోలీసులు మంచిగా కనిపించారా అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు  పోలీసులు వన్ సైడ్ అని మాట్లాడుతున్నారు, మూడు సార్లు సీఎం గా పని చేసిన పెద్దాయనకు పోలీసుల విధులు ఎలా ఉంటాయో తెలియదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి పోలీసులను వైసీపీలో చేరిపోమ్మని బాబు గారు కోరడం ద్వారా  ఆయన అసహనం పీక్స్ కి చేరిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: