ప్రజా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తు ముందుకు  సాగుతున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే నేడు వైయస్సార్ కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 రాష్ట్రంలోని ప్రజలు ఎవ్వరు కంటి సమస్యలతో బాధ పడకూడదు అనే ఉద్దేశంతో... రాష్ట్రంలో ఉన్న అంధత్వాన్ని దూరం చేయడానికి... సామాన్య ప్రజలకు మెరుగైన కంటి వైద్య చికిత్సలు చేయించడానికి వైయస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కాగా  ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి ప్రజలకి  మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మల్కాపురం పిడుగురాళ్ల మచిలీపట్నం ఏలూరు పులివెందుల లో  గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతోపాటు... ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు సహా  ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. 

 

 

 

 

 కాగా  డిసెంబర్ 21న కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపిన జగన్.... లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి హెల్త్ ప్రొఫైల్ డేటా ఆ కార్డులో ఉంటుందని తెలిపారు. ఆ కార్డు తో ఏ ఆస్పత్రికి వెళ్లిన వారి అనారోగ్య సమస్యలకు సంబంధించి పూర్తి సమాచారం అక్కడ తెలిసిపోతుందని జగన్ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలో ఒక వెయ్యి వ్యాధులు  ఉండగా... వాటిని పెంచుతూ ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి 2000 వ్యాధులను తెస్తున్నట్లు  జగన్ తెలిపారు. ఇక డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోనే పరిగణిస్తామని... ఈ ఆరోగ్య శ్రీ కార్డు పరిధిలోకి బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల్లోని  కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను కూడా అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని జగన్ తెలిపారు. అయితే ఈ ఆరోగ్య శ్రీ పథకం కార్డుల పంపిణీ డిసెంబర్ 21న జరుగుతుండగా.... ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు కావడం విశేషం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ కార్డును అందించనున్నారు జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: