ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మళ్ళీ ఎర్ర స్మగ్లర్ల జాడలు కానవస్తున్నాయి. యద్దేచ్ఛగా ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే 13 దుంగలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకుపాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారు తమిళనాడు ధర్మపురి జిల్లా చిట్టేరి పంచాయతీకి చెందిన మురుగేశన్ జయపాల్ (25),  రామలింగం అరుణాచలం (30),  భూపాల్ కందస్వామి (27), డ్రైవర్ పెరుమాళ్ వేలు (35) గా గురించారు. టిఎన్ 07ఎఎల్ 3903 నెంబరు గల  వాహనం ఇది వరకు ఐదు  సార్లు తిరుమల కు వచ్చి ఎర్ర చందనం దుంగలను రవాణా చేసినట్లు  విచారణలో తెలిసింది. 



ఈ వాహనం తిరుమల నుంచి రెండు టోల్ గేట్లను దాటుకుని వెళుతోంది. దీనిపై నిఘా లేకపోవడంతో అక్రమ రవాణా యదేచ్చగా సాగుతోంది.  స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొత్తానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు తమిళ స్మగ్లర్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తిరుమల నుంచి ఎర్ర చందనం దుంగలు రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలిపిరి వద్ద నిరోధించారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, ఇతరటీమ్ లు శేషాచలం పరిసరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనల తో ఆ ఎస్ ఐ వాసు, డీఆర్ ఒ పివి నరసింహారావు టీమ్   తిరుమల నుంచి వచ్చే వాహనాలపై దృష్టి పెట్టారు.




టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి మొదటి ఘాట్ రోడ్డులో అలిపిరికి ముందు కాపు కాశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఒక టాటా సఫారీ వాహనం, పూజలు చేసుకుని వస్తున్నట్లు , వాహనం ముందు భాగాన పూలతో అలంకరించి వస్తూ కనిపించింది. టాస్క్ ఫోర్స్ టీమ్ ఆ వాహనాన్ని అడ్దగించారు. అందులో 13 ఎర్ర చందనం దుంగలు లభించాయి. దుంగలతో పాటు నలుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  పట్టికుబడిన వాహనం ఆధారంగా రెండు టోల్ గేట్లు దాటి యధేచ్చగా అక్రమ రవాణా చేస్స్తున్న విషయాన్ని గుర్తించారు.  ఇటీవల ఇదే వాహనంలో తిరుమలకు 5 సార్లు వచ్చి ఎర్ర చందనం రవాణా చేసినట్టు పోలీస్ విచారణంలో తేలింది.



మరింత సమాచారం తెలుసుకోండి: