కేవలం కొద్ది నెలల క్రితమే బెయిల్ మీద విడుదలయిన మారుతీ రావు ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటాడు. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు అప్పట్లో దళిత కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ ను దారుణంగా సుపారీ ఇచ్చి హత్య చేయించిన మారుతీ రావు ఉన్నత కులమైన వైశ్య వర్గానికి చెందిన వాడు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెంలో మారుతీ రావు ఒక కాంట్రాక్టు హంతకుడి చేత ప్రణయ్ ను హాస్పిటల్ బయట ఘోరంగా నరికి చంపించాడు. అయితే అరెస్ట్ అయిన మారుతీ రావు ఎప్రిల్ లో తెలంగాణ పోలీసు సహకారంతో బయటికి వచ్చాడు. తెలంగాణ పోలీసులు 'నివారణ నిర్బంధ చట్టం ప్రకారం' అతనిని బెయిల్ పైన బయటికి తీసుకుని వచ్చారు.

అయితే మొన్న హిందూ ఉత్సవ కమిటీ నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మారుతీ రావు మిర్యాలగూడ రూలింగ్ ఎమ్మెల్యే అయిన భాస్కర్ రావుతో స్టేజి పైన కనిపించాడు. అలాగే అతనితోపాటు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకే స్టేజి పైన అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఉండటం యాదృచ్చికం అయితే కాదు. తానే తన అల్లుడిని హత్య చేయించినట్లు ఒప్పుకున్న మారుతీ రావే ఆ ఉత్సవాన్ని నిర్వహించాడు మరియు అతను  హిందూ ఉత్సవ సమితి మిర్యాలగూడ అధ్యక్షుడు.

ఇక్కడ విశేషమేమిటంటే ప్రణయ్ హత్యకు గురైనప్పుడు అతని ఇంటికి వెళ్లి నిందితుడికి శిక్ష పడేలా చేస్తానని మాట ఇచ్చిన మొట్టమొదటి రాజకీయవేత్త భాస్కర్ రావేనట. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేస్తానని అన్న భాస్కర్ రావుతో పాటు అప్పటి నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ సురేందర్ రెడ్డి కూడా ప్రణయ్ ఇంటికి వెళ్లి మారుతీ రావు పై చట్టరీత్యా చర్య తీసుకునే పనిని దగ్గరుండి చూస్తానని హామీ ఇచ్చాడట. ఇప్పుడు అదే మారుతీ రావు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆయనతో కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండడం విశేషం. ప్రణయ్ సన్నిహితులు మరియు మద్దతుదారులు మారుతీ రావు అన్యూహరీతిలో బెయిలు పై బయటకు వచ్చి ఇలా జాలీ గా తిరుగుతుండడం సహించకముందే ఇలాంటిది ఒకటి జరగడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: