రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆరొవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో తెలంగాణాలో ఉండే వాహనాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేశారు. ఈరోజు 8150 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

                       

ఆ అందుబాటులో ఉండే వాహనాలలో 3013 ఆర్టీసీ, 1804 అద్దె, 696 ప్రైవేట్, 2637 మాక్సీ క్యాబ్‌లు నడుస్తున్నాయని వారు తెలిపారు. కాగా తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించినట్లు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. కాగా మెట్రో రైలు కూడా పభుత్వ వినతి మేరకు అదనపు ట్రిప్పులను నడుపోతోందని అయన తెలిపారు.  

                      

కాగా ప్రైవేట్ వాహనాలని స్టేజ్ క్యారియర్లుగా నడిపేందుకు అనుమతినిచ్చినట్లు ఆ ముఖ్య కార్యదర్శి తెలిపారు. తెలంగాణాలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని వాహనాలను అందుబాటులో తీసుకోవాలని ఓలా, ఉబర్‌లను కోరామని అయన చెప్పారు. కాగా సెట్విన్ బస్సుల ట్రిప్పులను పెంచమని చెప్పారు. తెలంగాణకు అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఆర్టీసీలను కోరినట్లు వెల్లడించారు.  

               

అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మో కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రభుత్వం తగ్గాను అన్నట్టు ప్రవర్తిస్తుంది, అటు ఆర్టీసీ కార్మికులు తగ్గాను అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మరి ఈ సమ్మో ఎప్పుడు ఆగుతుందో ? ప్రజల ప్రయాణం కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి. 

                   

మరింత సమాచారం తెలుసుకోండి: