దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నప్పటికీ నగర ప్రయాణికులకు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేవు. గురువారం 8150 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో 3013 ఆర్టీసీ, 1804 అద్దె, 696 ప్రైవేట్, 2637 మాక్సీ క్యాబ్‌లు నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నాలుగు రోజుల క్రితం దాఖలైన హౌస్ మోషన్ పిటీషన్ పైన అటు ప్రభుత్వానికి..ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసు ఈ రోజుకు పోస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతోపాటు, మ్యాక్సీ క్యాబ్‌లు, సెట్విన్ బస్సులతోపాటు ఆటో రిక్షాలు, ప్రైవేటు వాహనాలు తిరుగడంతో సమ్మె ప్రభావమే కనబడటం లేదు. నగరంలో ఉన్న అరకోటికి పైగా వాహనాలలో గ్రేటర్‌లో 1.3 లక్షల ఆటోరిక్షాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీటితోపాటు వ్యక్తిగత వాహనాలలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.



తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ వినతి మేరకు మెట్రో రైలు అదనపు ట్రిప్పులను నడుపుతోందన్నారు.దసరా పండుగ సందర్భంగా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూశారు. ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అవసరమైన వాహనాలను డిమాండ్ మేర అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారియర్లుగా నడిపేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. మరిన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని ఓలా, ఉబర్‌లను కోరామన్నారు. సెట్విన్ బస్సుల ట్రిప్పులను పెంచామన్నారు. తెలంగాణకు అదనపు బస్సులు నడపాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఆర్టీసీలను కోరినట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 డిపోల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్నారు.




గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగనాయక్, రంగారెడ్డిజిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రవీణ్‌రావు, మేడ్చల్ జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ (డీటీఓ) కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఖైరతాబాద్ ఆర్‌టీవోలు రాంచందర్, దుర్గప్రసాద్, తిరుమలగిరి ఆర్‌టీవో శ్రీనివాసరెడ్డి, మెహిదీపట్నం ఆర్‌టీవో సీపీ వెంకటేశ్వర్లు, బండ్లగూడ ఆర్‌టీవో సదానందం మలక్‌పేట ఆర్‌టీవో సుభాష్ చంద్రారెడ్డి, నాగోల్ ఆర్‌టీవో సురేశ్‌రెడ్డితోపాటు డీటీవో మేడ్చల్ ఆర్‌టీఓ కిషన్, ఉప్పల్ ఆర్‌టీవో రవీందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా పరిధిలో డీటీసీ ప్రవీణ్‌రావుతోపాటు మన్నెగూడ ఆర్‌టీవో రఘునందన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిసి వాహనాలు, డ్రైవర్ల సమీకరణ, డ్రైవింగ్ టెస్టింగ్ వంటి బాధ్యతలు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: