ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఆత్మహత్య నివారణ పై దృష్టి సారించేందుకు  హైదరాబాద్ లోని గాంధీ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం పరిపాటే. ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆత్మహత్య నివారణ పై దృష్టి సారించి ప్రజలకు మరియు వైద్య సిబ్బందికి అవగాహన చేపట్టడంలో భాగంగా గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ అజయ్ కుమార్,


పీజీ విద్యార్థులు రవి వర్మ, ప్రదీప్, సూర్యప్రభ, వర్ష,చిన్ని కృష్ణ,రాగిణి మరియు హౌస్ సర్జన్స్ వైద్యులు సంతకాల సేకరణ కార్యక్రమం -మానసిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి 40 సెకనుకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది అన్ని వయస్సు వారిని ఇబ్బందికి గురి చేస్తోంది,ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అన్ని మరణరాలు కల్లా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది 2వ కారణంగా పరిగణలో ఉంది.




ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ఓ.పి  బ్లాక్, సూపరిండెంటెంట్  బ్లాక్, మెడికల్ కాలేజీ లో మూడు శిబిరాలన్ని పెట్టి మానసిక వ్యాధుల గురించి ముక్యంగా ఆత్మహత్య ప్రయత్నం మరియు వాటి నివారణకు మార్గాలు ప్రజలకు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి వారితో సమయం కేటాయించడం వల్ల సాగనికంటే ఎక్కువ గా ఈ అనర్థాలు జరగకుండా ఆపవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా ఆత్మహత్య నివారిచడం లో పాలుపంచుకొని ప్రమాణము గా సంతకాలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: