ఇక నుంచి టూరిస్టులు స్వేచ్ఛగా జమ్మూ కశ్మిరీ అందాలను ఆస్వాదించవచ్చు. తరికొట్టిన చోటుకు ఇప్పుడు మర్యాదపూర్వకంగా స్వాగతించడం విశేషం. నిన్న మొన్నటి వరకు ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి భయం భయంగా తిరిగాడేవాళ్లు. అలాంటిది. చివరికి వైష్ణవి దేవిని దర్శించుకునేందుకు సైతం పటిష్టమైన బందోబస్తు మధ్య వెళ్లాల్సిన వచ్చేది. ఇక నుంచి  అంతలా భయపడాల్సిన పరిస్థితులు ఉండవని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు టూరిస్టులు ఇక నుంచి స్వేచ్ఛగా రావచ్చు.. పోవచ్చంటున్నారు. రెండు నెల‌ల నిషేధం త‌ర్వాత జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ప‌ర్యాట‌కుల‌ను స్వాగతిస్తుంది. 



ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్ నుంచి ప‌ర్యాట‌కుల‌ను హుటాహుటిన వెళ్లగొట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌ర్యాట‌కుల రాక‌పై ఉన్న నిషేధాన్ని ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. నిన్న మొన్నటి వరకు ఉన్న నిషేధం కారణంగా క‌శ్మీర్‌కు ప్ర‌ధాన ఆర్థిక వ‌న‌రు  పర్యాటక రంగం మాత్రమే. యాత్రికుల‌పై నిషేధం ఉన్న కార‌ణంగా.. ఆయా ప్రాంత టూరిజం దెబ్బ‌తిన్న‌ది.  దాంతో పాటుగా క‌శ్మీర్ నుంచి ప‌ర్యాట‌కుల‌ను హుటాహుటిన వెళ్లగొట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ‌త జూన్‌లో సుమారు 1.74 ల‌క్ష‌ల మంది టూరిస్టులు ప్రక్రుతి సిద్ధమైన క‌శ్మీర్‌ అందాలను ఆస్వాదించేందుకు వచ్చారు.




అదే విధంగా జూలైలో 1.52 ల‌క్ష‌ల మంది వెళ్లారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు క‌శ్మీర్ లోయ‌కు వ‌చ్చే ప్ర‌తి యాత్రికుడికి కావాల్సిన స‌హాయాన్ని అందివ్వాల్సిందిగా ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ట్రావెల్  అడ్వైజ‌రీని ఎత్తివేయాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగ‌స్టు నెల‌లో ట్రావ‌ల్ అడ్వైజ‌రీ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత టెలిఫోన్‌, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపేశారు. దాంతో పర్యాటక రంగం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పుడా పరిస్థితి నుంచి బయటపడేందుకు గవర్నర్ అవసరమైన చర్యలు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: