ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సిన పర్యటన రద్దు అయింది.శుక్రవారం ఆయన వెళ్లాల్సి ఉంది. వాస్తవానికి సీఎం జగన్  కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసేందుకు వెళ్లాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జగన్ పర్యటన జరిగితే శనివారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది.


ప్రధానితో సమావేశం సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. పీపీఏలు, పోలవరం తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉండేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.



ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.12500 అందజేస్తుండగా.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ రద్దు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో వారం క్రితమే భేటీ అయిన ముఖ్యమంత్రి తిరిగి ఆయనతో భేటీ అయ్యే ప్రయత్నాలు చేయటం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. వాస్తవానికి  ఉప ఎన్నికల కారణంగానే జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: