ఆర్టీసీ సమ్మె మొదలై  ఆరూ  రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లపై స్పందించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆర్టీసీ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తుండగా  మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా  ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తునప్పటికీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ప్రయాణికులకు  ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ప్రైవేటు అద్దె బస్సులను తిప్పుతున్నప్పటికీ అవి ప్రయాణికుల పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాయి. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో  ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు కూడా తక్కువ సంఖ్యలో ఉండడంతో బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె కి ప్రతిపక్ష పార్టీలన్ని  మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉద్యోగ సంఘాల మద్దతు కూడా కూడగట్టుకొని... సమ్మెను ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. కాగా  కార్మికులు తమ వాదనను కోర్టు లో కూడా వినిపించారు. 

 

 

 

 

 

 అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలనీ  అడిగితే కేసీఆర్ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతూ కార్మికుల సమ్మె చేపట్టి హామీలను నెరవేర్చమని  అడిగినప్పటికీ కూడా కెసిఆర్ స్పందించడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగానే... తెలంగాణలో కూడా విలీనం చేయాలని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చేయడం లేదని  కార్మికులు  ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్మికులు అందరూ జగన్ ముద్దు  కేసీఆర్ వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: