డ్రాగాన్ ఇపుడు భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఆయన భారత్ లో  టూర్ పెట్టుకున్నారు. ముఖ్యంగా  తమిళనాడులోని మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు  జిన్ పింగ్ భారత ప్రధాని నరేంద్రమోడీ శిఖరాగ్రస్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల సంగతేంటని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. భారత్ ఇపుడు ప్రపంచంలోనే హాట్ ఫేవరేట్ ఉంది. అదే సమయంలో పాకిస్థాన్ కి మంటగా కూడా ఉంది.


దీంతో భారత్ లో చైనా అధ్యక్షుడి పర్యటనపైనే అందరి కళ్ళు పడుతున్నాయి. కాశ్మీర్ విషయంలో పాక్ కి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నజిన్ పింగ్  భారత్ పర్యటన తరువాత మారుతారా. ఆయన్ని కాశ్మీర్ విషయంలో భారత్ కి అనుకూలంగా మార్చగలిగే శక్తి మోడీకి ఉందా. మోడీ మ్యాజిక్ కి జిన్ పింగ్  పడతారా అన్నవి ఎన్నో ప్రశ్నలు ఎదుట ఉన్నాయి.ఇదిలా ఉండగా ఓవైపు అమెరికాతో స్నేహం చేస్తున్న భారత్ మరో వైపు చైనాను కూడా దగ్గరచేసుకోవాలనుకుంటోంది. భారత్ విదేశాంగ విధానం అందరికీ తెలిసిందే. ఎవరికీ చెడ్డ కాకుండా తాను ఉండాలన్నది భారత్ వైఖరి. అదే సమయంలో తాను నష్టపోకూడదని కూడా భారత్ విధానంగా  ఉంది.


ఇక ఈ నెల 12న మహాబలిపురం వేదికగా చైనా, భారత్ అధినేతలు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారోనన్న ఉత్కంఠ అన్నది అందరిపైనా ఉంది. అదే విధంగా పాక్ ఈ భేటీపై కుళ్ళుకుంటోంది. చైనా ఎక్కడా భారత్ కి దగ్గర అయిపోతుందో, తన వైపు కాకుండా భారత్ మాట, పాట పాడుతుందోనని తెగ కంగారు పడుతోంది. మరో వైపు మోడీ రాజకీయ చాణక్యం ఆయన దౌత్యనీతి మీద కూడా పాక్ అనుమానంగా చూస్తోంది. అందరినీ తన బుట్టలో పడేసే భారత ప్రధాని  డ్రాగాన్ కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేసి స్నేహబంధంలో కలిపేసుకుంటారేమోనని హడలిపోతోంది. మరి భారత్ ప్రధాని పాక్ కి షాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా చైనా అధ్యక్షుడు భారత్ లో పర్యటన దాయాది గుండెల్లో బాంబులు పేలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: