చంద్రబాబు రాజకీయ జీవితం నాలుగు పదులు దాటింది. చింతమనేని రాజకీయం అందులో మూడవ వంతు కూడా ఉండదు, ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా మాత్రమే  దెందులూరు నుంచి గెలిచారు. మంత్రి కూడా కాదు, కానీ చంద్రబాబుకు బాగా ఇష్టుడైపోయారు. చంద్రబాబు ఈ మధ్య‌కాలంలో ఒక టీడీపీ  నాయకుడి గురించి ఎక్కువగా బాధపడింది అంటూ ఉందంటే అది ఒక్క చింతమనేని మాత్రమేనని చెప్పుకోవాలి.


మరి చింతమనేనిలో స్పెషాలిటీ ఏంటి. అంత స్పెషాలిటీ ఉంటే చింతమనేనికి బాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు. పార్టీలో కూడా కీలకమైన బాధ్యలు ఎందుకు ఇవ్వలేదు. ఇది తెలుగుదేశం పార్టీలోనే కాకుండా బయట పార్టీలలోనూ చర్చగా ఉంది. మాంత్రికుడి ప్రాణాలు చిలక‌లో ఉన్నట్లుగా బాబు ప్రాణాలు చింతమనేనిలో ఉన్నాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయంటున్నారు. చింతమనేనికి రాస్ట్రవ్యాప్తంగా పేరు ఎలా వచ్చింది. ఆయన ఒక్కసారిగా లైం లైట్ లోకి ఎలా వచ్చాడు అన్న  సంగతి అందరికీ తెలిసిందే. ఆయన‌ తాశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన తరువాత అందరికీ బాగా తెలిసిపోయాడు. ఆనాడు చింతమనేని మీద చర్యలు తీసుకోవడానికి చంద్రబాబుకు ధైర్యం చాలలేదని టీడీపీ వారే అంటారు. అటువంటి బాబు పదవి పోయాక మాత్రం చింతమనేనిని పదే పదే  కలవరిస్తున్నారు.


ఇది కూడా బాబు రాజకీయంలో ఒక భాగమేనని అంటున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు మరోమారు చింతమనేనిని వెనకేసుకు మాట్లాడడం విశేషం. చింతమనేని మీద అలా వెల్లువలా కేసులు పెడుతూనే ఉన్నారంటూ బాబు మండిపడుతున్నారు. ఎన్ని కేసులు పెడతారు, ఆయన్ని  ఏం చేద్దామనుకుంటున్నారంటూ వైసీపీ సర్కార్ మీద దండెత్తారు.  మరి చింతమనేని తప్పు చేయలేదా అన్నది బాబుకు తెలియదా, తెలిసినా ఆయన మద్దతు ఇస్తున్నాడు అంటే అందులో నుంచి కూడా సానుభూతి పొందాలన్న ప్లాన్ తోనేనని అంటున్నారు. అయితే చింతమనేని లాంటి వారి పేర్లను బాబు ఎన్ని సార్లు వల్లిస్తే అన్ని సార్లు ఆయన పొలిటికల్ గా  ఇబ్బందుల్లో పడతారన్న మాట సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. మరి చింతమనేని చింత బాబుకు ఎపుడు తగ్గుతుందో చూడాలంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: