వైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక పధకాలు ప్రవేశపెడుతూ దూసుకుపోతున్నారు.  జగన్ ప్రవేశపెడుతున్న ప్రజాయోగ్యమైన పధకాలు మెప్పించేవిధంగా ఉన్నాయి.  ఈ పధకాలు పేదలకు దగ్గర చేస్తుండటంతో అయన ఇలాంటి పధకాలను ఎక్కువగా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటె, వైఎస్ జగన్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు.  


ఢిల్లీలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరికింది.  మొత్తం 21 ప్రతిపాదనలు మోడీ ముందు ఉంచారు.  వాటి అమలుకు కావాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు.  అందులో కొన్నింటికి మోడీ సానుకూలంగా స్పందించినట్టు జగన్ పేర్కొన్నారు.  అయితే, అదే రోజున జగన్ ఢిల్లీలో అమిత్ షాను కూడా కలవాల్సి ఉన్నది.  కానీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు.  అప్పట్లో నగరంలో లేరు. 

కాగా, ఈరోజున ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది.  కానీ, సడెన్ గా అమిత్ షా మహారాష్ట్ర వెళ్లాల్సి వచ్చింది.  అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  కాబట్టి అమిత్ షాను కలిసేందుకు వీలు కలగలేదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తయ్యే వరకు షా ఢిల్లీలో దొరకడం కష్టమే.  కాబట్టి ఎన్నికలు పూర్తయ్యాక జగన్ షా అపాయింట్మెంట్ తీసుకుంటే మంచిది.  


ఇదిలా ఉంటె, ఈరోజు జగన్ ను మెగాస్టార్ చిరంజీవి అమరావతిలో కలవాల్సి ఉన్నా.. జగన్ ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యింది.  జగన్ ఢిల్లీ టూర్ కూడా క్యాన్సిల్ కావడంతో జగన్ మిగతా పనుల్లో బిజీ అయ్యారు.  మెగాస్టార్ కు అక్టోబర్ 14 వ తేదీన ఆపాయిట్మెంట్ ఇచ్చారు.  అక్టోబర్ 14 వ తేదీన జగన్.. మెగాస్టార్ తో భేటీ అవుతున్నారు.  మెగాస్టార్ సైరా సినిమా చూడాలని వైఎస్ జగన్ ను కోరబోతున్నారు.  మొదటి తెలుగు స్వాతంత్ర సమరయోధుడి కథతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తప్పకుండా చూసి అభిప్రాయం చెప్పాలని జగన్ ను కోరేందుకు మెగాస్టార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: