ఇటీవల కాలంలో అనేకమంది అబ్బాయిలు లింగమార్పిడి చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  కారణాలు ఏవైనా కావొచ్చు.. అవకాశాల కోసం కావొచ్చు.. చిన్నతనం నుంచి వాళ్లలో కలుగుతున్న మార్పుల వలన కావొచ్చు.. కారణం ఏదైనా సరే మారేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇలానే రాయపూర్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు కూడా లింగమార్పిడి చేయించుకోవాలని అనుకున్నాడు.  


రాయపూర్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ కు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు.  సర్జరీ మామూలుగానే తిరిగింది.  సర్జరీ తరువాత అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.  ఇన్ఫెక్షన్ నుంచి తప్పించడం కోసం మరిన్ని సర్జరీలు చేశారు.  కానీ, చివరకు ఆ వ్యక్తి మరణించాడు.  దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బందిపై గొడవకు దిగారు.  


వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు మరణించాడని కేసు పెట్టారు.  అయితే, ప్రముఖ వైద్యులు, సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలోనే సర్జరీ జరిగిందని, కానీ, అతని శరీరానికి ఇన్ఫెక్షన్ సోకిందని, ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేందుకు శతవిధాలా ప్రయాణం చేశామని కానీ కుదరలేదని పేర్కొన్నారు వైద్యులు.  మాములుగా లింగమార్పిడి విధానం దేశం నేరం.  చట్టంలో దీనికి పెద్ద శిక్షలు ఉంటాయి.  


కానీ, చట్టవ్యతిరేకంగా చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి.  దొరికినపుడు మాత్రమే ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి.  సర్జరీ జరిగి అంతా ఒకే అయితే.. అసలు విషయాలు బయటకురావు. దేవుడు ఇచ్చిన శరీరాన్ని మార్చాలని అనుకుంటే ఇలాగే జరుగుతుంది.  ఈ శరీరం ఎలా ఉందొ అలా ఉంటేనే అన్ని సక్రమంగా పనిచేస్తాయి.  దేన్నైనా మార్చాలని చూస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే అని విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.  ప్రస్తుతం దీనిపై కేసు నడుస్తోంది.  భవిష్యత్తులో మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది.  కొంతమంది అందం మోజులో పడి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు.  ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: