అదేంటో కానీ గెలుపు వలపు  పెరిగినంతగా ఓటమి ఘాటు అందదు. ఓడినా మాదే పైచేయి ఇదే విధానం ఇపుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అనుసరిస్తున్నారు. మనకేమిటి, మన పార్టీకేమిటి, అంతా బ్రహ్మాండం అంటూ బాబు డబ్బా కబుర్లు చెబుతూంతే తమ్ముళ్ళు చప్పట్లు కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అయిదు నెలలు అయింది. కానీ ఇప్పటికీ వైసీపీది గెలుపే కాదని బాబు గారు మాట్లాడున్నారంటేనే విడ్డూరంగా ఉంది.


జగన్ని ముఖ్యమంత్రిగా ఒక్కసారి జనం చూడాలనుకున్నారు. చూసేశారు. ఇక వైసీపీ కధ పరిసమాప్తం. మళ్ళీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనంటూ బాబు ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు పసుపు తమ్ముళ్ళకు సంతోషంగా ఉండొచ్చేమో కానీ బయట నుంచి పరిస్థితిని గమనిస్తున్న వారికి మాత్రం  టీడీపీ మళ్ళీ పైకి లేస్తుందా అనిపించేస్తోంది.  తెలుగుదేశం పార్టీ ఎన్నో సార్లు ఓడిపోయింది మళ్ళీ రెట్టింపు బలంతో గెలిచింది అని చంద్రబాబు చెప్పడం కూడా బడాయి ప్రకటనేనని అంటున్నారు. 1989లో టీడీపీ తొలిసారి ఓడింది. అపుడు పార్టీ మూల పురుషుడు అన్న గారు ఉన్నారు.


ఆయన చలవతో టీడీపీ 1994లో బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక చంద్రబాబు ఆ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పగ్గాలు పట్టుకుని 1999 ఎన్నికల్లో వాజ్ పేయ్ గాలిలో గెలిచినా బొటాబొటీ సీట్లే దక్కాయి. ఇక 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 2014లో విభజన ఏపీలో కూడా టీడీపీ గెలిచింది సాధారణ మెజారిటీతోనే. ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి పార్టీ పుట్టిన తరువాత ఎన్నడూ చూడని పరాభవం ఎదురైంది. కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే బాబు       నేత్రుత్వంలో టీడీపీ క్రుంగిపోతోంది తప్ప ఎత్తిగిల్లడంలేదని అర్ధమవుతోంది. 


ఇక తెలంగాణాలో పార్టీ దుకాణం దాదాపుగా బంద్ అయింది. ఏపీలో కూడా రాయలసీమ సీట్లూ, ఓట్లూ బాబు నాయకత్వంలో ప్రతీ ఎన్నికకూ తగ్గిపోతూ వస్తున్నయి. కోస్తా,  ఉత్తరాంధ్ర జిల్లాల‌లో తాజా ఎన్నికల్లో టీడీపీ  పట్టు పూర్తిగా పోయింది. ఈ నేపధ్యంలో టీడీపీ  అధినేత ఎవరిది గాలి పార్టీయో చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ వన్ టైం సీఎం కాదు ఏపీకి 30 యియర్స్ సీఎం అని, బాబు పర్మనెంట్ ప్రతిపక్ష నేతగా ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: