పదవిలో ఉన్న ఐదు నెలల కాలంలో చిటికెలో ఇన్ని చేస్తే.. ఐదేళ్లు పదవిలో ఉంటె ఇంకెన్ని చెయ్యొచ్చు.. ఎన్ని మంచి పనులు చెయ్యొచ్చు.. కానీ అవేమి మీకు పట్టవు.. మంచి చేసేవాళ్ళు మీకు అవసరం లేదు.. ఇలాంటి డైలాగులతో భరత్ అనే సినిమా ఉంటుంది.  ఈ డైలాగులు ప్రతి ఒక్కరిని మెప్పించాయి.  ఈ సినిమాలోని చాలా విషయాలను మన ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.  అందులో ఒకటి ట్రాఫిక్ సమస్య.  


ట్రాఫిక్ విషయంలో కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నది. మనిషి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.  ఇక ఇదిలా ఉంటె, జగన్ కూడా ప్రజాయోగ్యమైన పధకాలు ఎన్నింటినో తీసుకొచ్చారు.  ప్రజలకు నచ్చే విషయాలను తీసుకొచ్చారు.  ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారు.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ చేసిన మంచిపనులు చాలా ఉన్నాయి.  అందులో ఒకటి ఉపాధి కల్పించడం.  ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం.  


యువతి ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క ఉన్న ఊర్లోనే ఖాళీగా ఉండిపోతున్నారు.  వారికీ ఉపాధి కల్పించింది. గ్రామ వాలంటీర్లుగా నియమించింది.  ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించింది.  ఇలా నియమించిన వాలంటీర్లు గ్రామాల్లో పనిచేస్తున్నారు.  గ్రామ సచివాలయ ఉద్యోగాలను కల్పించింది.  గ్రామాల్లోనే పరిపాలన జరగాలని చెప్పి ఈ పధకాన్ని తీసుకొచ్చారు.  విద్యార్థులకు చదువు కోసం పదాలు, అవ్వలకోసం ప్రవేశపెట్టిన పధకం ఇలా ఎన్నో ఉన్నాయి.  


వీటిని కేవలం నాలుగు నెలల కాలంలోనే జగన్ ప్రవేశపెట్టాడు.  అమలు చేస్తున్నాడు.  భరత్ అనే నేను సినిమాలో మాదిరిగానే.. జగన్ ఐదేళ్ళలో ఎన్ని కొత్త పధకాలు ప్రారంభిస్తారో.. ఎన్ని మంచి పనులు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.  ఒక్క ఐదేళ్లు కాదు.. జగన్ అనుకున్న పనులు ఈ ఐదేళ్ళలో చేస్తే.. ఆయనకు మరో ఐదేళ్లు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: