ఒకప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం,కష్టంతో పాటు, చాలా పెద్ద ప్రాసెస్‌గా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగి ఈ వివరాలు సులువుగా తెలుసుకోనే విధానాలు అందుబాటు లోకి వచ్చాయి. ఇకపోతే  2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని జమ చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో దీపావళి పండగ సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 6 కోట్ల మంది చందాదారులకు బిగ్ బొనాంజా ప్రకటించింది.


2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీరేటును పెంచింది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఒకపనిమాత్రం కచ్చితంగా చేయాలని చెబుతుంది.. అదేమంటే ఈ వడ్డీ ప్రయోజనం పొందాలంటే ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ తప్పని సరిగ్గా చేసుకోవాలట. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి యూఏఎన్ నెంబర్ ఉన్న వారికే వడ్డీ పెంపు వర్తిస్తుంది. మీకు యూఏఎన్ నెంబర్ లేకపోతే మీ కంపెనీని అడిగి వెంటనే నెంబర్ తీసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో దాన్ని యాక్టివేట్ చేసుకోండని చెబుతున్నారు.


ఇక యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్, మెంబర్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటి వివరాలు అవసరం అవుతాయి. మీరు వెంటనే కంపెనీ హెచ్ఆర్ అధికారులను అడిగి యూఏఎన్ నెంబర్ తీసుకోండి. ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి దాన్ని యాక్టివేట్ చేసుకోండని తెలిపారు అధికారులు.


పీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో యూఏఎన్ నెంబర్‌ను కేటాయిస్తుందని సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్ ఎక్స్‌పర్ట్ మణికరన్ సింగ్ తెలిపారు. దీంతో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.ఇకపోతే ఈ పీఎఫ్ అకౌంట్ వున్న ప్రతివారు వెంటనే ఇలా చేసి పెరిగిన వడ్డీ శాతాన్ని పొందండి...

మరింత సమాచారం తెలుసుకోండి: