ఎన్నికలు తొందరగా రావాలి, ఈ అరాచక పాలన పోవాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీయే అధికారం చేపట్టాలి. ఇదీ చంద్రబాబు నినాదం. జగన్ని ఎన్నుకుని జనం తప్పుచేశారు. ఇపుడు ఎన్నికలు పెట్టినా ఆ తప్పు సరిదిద్దుకుంటారు. రావాలి జగన్ కావాలి జగన్ అని పాట పాడిన వారంతా ఇపుడు రావాలి కరెంట్, కావాలి ఇసుక అంటున్నారు. జగన్ పాలన అపుడే  వెగటుపుట్టేసింది. ఆయన్ని దించేసి మనకే అధికారం అప్పగిస్తారు జనం.


ఇదే ఇపుడు చంద్రబాబు క్యాడర్ కి చెబుతున్న  ధైర్యం. మనం ఓడిపోయి కూడా అపుడే అయిదు నెలలూ అయిపోయింది. చూసారా ఎంత దూరం వచ్చేశామో ఇలా కళ్ళు మూసుకుంటే అలా ఎన్నికలు వచ్చేస్తాయి ఇదీ చంద్రబాబు విశాఖలో తమ్ముళ్ళకు చెబుతున్న మాట. జమిలి ఎన్నికలు 2023లో కచ్చితంగా వస్తాయి. మన దగ్గర  సమాచారం ఉంది.


ఒకవేళ ఆలా రాలేదే అనుకోండి. ఎటూ 2024లో ఎన్నికలు ఖాయంగా వస్తాయి. ఈసారి టీడీపీ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరు. జగన్ పార్టీకి బేస్ లేదు. టీడీపీ అలా కాదు, కుటుంబాలకు కుటుంబాలు కలగలసిపోయిఉన్న పార్టీ ఇది. ఈ పార్టీ మరో ముప్పయ్యేళ్ళ‌ పాటు అధికారంలో ఉండేలా చూస్తాను. మీరంతా నాతో నడవండి అంటున్నారు బాబు గారు.


జగన్ అతి తెలివి చూపిస్తున్నారు. తానే గొప్ప అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే మరి రాజకీయంగా పోటీ కూడా ఉండదు, కాంగ్రెస్ కి నాయకత్వమే లేదు. ఇతర పార్టీలు కూడా పెద్దగా పుంజుకోవు. మొత్తం మీద రాజకీయ మైదానం ఖాళీగా ఉంది. మనం అందరం కలిస్తే చాలు విజయం ఖాయం. సమీక్షా సమావేశంలో చంద్రబాబు చూపిస్తున్న సినిమా కంటెంట్ బాగానే ఉంది కానీ అది ఆచరణలో జరుగుతుందా అన్నదే ఇపుడు తమ్ముళ్ళకు పట్టుకున్న డౌట్.


మరింత సమాచారం తెలుసుకోండి: