ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడుతుంది అంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు వర్షం వస్తే బాగుండు అనుకున్న ప్రజలే ఇప్పుడు వర్షం వస్తే ఇదేం బాదరా  నాయనా అని ఆందోళన చెందుతున్నారు . వర్షాలు తగ్గుముఖం పట్టింది అని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ నిమిషాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షాలు కురవడంతో... ఇంకా వర్షాలు కురిస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని  ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 

 

 

 ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల పంటలు దెబ్బతినగా... రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండు మూడేళ్లలో వర్షాలు కురవక కరువులో కూరుకు  పోయిన రైతన్న... ఈసారి తొలకరి చినుకు పలుకరించడంతో పంటలు వేసి మురిసిపోయాడు. కాగా  వర్షాలు ఎక్కువ అవడంతో వేసిన పంట కాస్తా మునిగిపోయి మళ్ళీ నష్టాల పాలయ్యాడు  రైతన్న. ఇక నగరాల్లో అయితే కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయం  అవ్వగా లోతట్టు ప్రాంతాలన్ని జల దిగ్బంధనం  అవుతున్నారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. 

 

 

 

 

 

 బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కాగా ఈ  వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. మరో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షం గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: