కష్టకాలంలో ఉన్న టీడీపీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబుకు మళ్ళీ ఎన్టీఆరే గతి అవుతున్నాడా? అంటే  అవుననే అనిపిస్తోంది.  ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్తితి రాష్ట్రం విడిపోయాక ఘోరంగా తయారైంది. తెలంగాణలో ఎలాగో పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇక మొన్న ఎన్నికల ఫలితాల తరవాత ఏపీలో కూడా పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. కేవలం 23 సీట్లే తెచ్చుకుని ప్రతిపక్షానికి పరిమితం కావడంతో నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.


వరుసగా చంద్రబాబుకు షాక్ ఇస్తూ నేతలు... బీజేపీ, వైసీపీలో చేరిపోతున్నారు. పదవులు ఉన్న నేతలు రాజీనామా చేసే పార్టీ మారాలని జగన్ కండిషన్ పెట్టడం వల్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా ఉన్నారు గానీ...ఆ కండిషన్ లేదంటే ఎప్పుడో జంప్ కొట్టేసేవాళ్ళు. అయితే నేతలు వెళ్లిపోతున్న చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం పార్టీలోని నేతలకు నమ్మకం కలిగించలేకపోతుందనే భావన ఉంది.


ఎందుకంటే చంద్రబాబు వయసు పెరిగిపోతున్న కొద్దీ...నేతల్లో నెక్స్ట్ పార్టీని నడిపించే నాయకుడు ఎవరనే ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఉన్న...ఆయన పెద్దగా ప్రభావం చూపించే నాయకుడుగా ఎదగలేకపోతున్నారు. దీంతో పార్టీ సీనియర్లలో ఒక ఆలోచన వచ్చింది. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయాలంటే మంచి ప్రజాధరణ జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుందని సీనియర్ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం.


అయితే చంద్రబాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ రాక విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక గతంలో 2009 ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం కూడా చేశారు. కానీ ప్రచారం తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ని పట్టించుకోలేదు. దీంతో ఎన్టీఆర్ కూడా పార్టీకు దూరం జరిగాడు. అయితే గత సంవత్సరం హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఏకమైంది. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ రావాలని కోరుతున్నారు.


ఎన్టీఆర్ ని తీసుకొచ్చి పార్టీలో కీలక పదవి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు సానుకూలంగా ఉన్న...ఎన్టీఆర్ పార్టీలోకి వస్తారా ? అంటే చెప్పలేం. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేనట్లే ఉంది. ఒకవేళ వచ్చిన చంద్రబాబు మళ్ళీ వాడుకుని వదిలేయారనే గ్యారెంటీ కూడా లేదు. చూద్దాం మరి రానున్న రోజుల్లో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: