తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం సరైన పరిష్కారం దిశగా  నిర్ణయం తీసుకోలేదు . ఆర్టీసీ కార్మికులు  కూడా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  ఆగ్రహించిన ముఖ్యమంత్రి కేసిఆర్... సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అయినా కూడా  కార్మికుల ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే రోజు రోజుకి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతునిస్తూ  కేసీఆర్ నిరంకుశ వైఖరి వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో కెసిఆర్ పై వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని... కనీసం నిలబెట్టుకోని కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ఆ హామీలు నెరవేర్చాలని అడిగినప్పటికీ కూడా... సన్ను పై స్పందించకుండా హామీ న నెరవేర్చమని అడిగిన 48 వేల మంది ఆర్టిసి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేయటం సిగ్గు చేటని విజయశాంతి విమర్శించారు . ఆర్టీసీ కార్మికులను  తమ ప్రభుత్వం తొలగించలేదని... కార్మికులే  సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కెసిఆర్ వితండవాదం చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. 

 

 

 

 

 

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించిన కేసీఆర్ నిరంకుశుడెనని  విజయశాంతి విమర్శించారు. కాగా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సిపిఐ పార్టీ... కెసిఆర్ నిరంకుశ వైఖరిని చూసి తాము ప్రకటించిన మద్దతు విషయంలో పునరాలోచన చేస్తామని చెప్పడం కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని విజయశాంతి ఆరోపించారు.ఇక  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తనకు ఓటు వేయరని  తెలిసిన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి... ఓటర్లు తమకు తామే సెల్ఫ్  డిస్మిస్ చేసుకున్నారని కేసిఆర్ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: