ఓడిపోయామనే బాధో....వయసు పెరగడం వల్ల వచ్చే చాదస్తామో గానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య బాగా ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఘోరంగా ఓడిపోవడం, వరుసగా నేతలు పార్టీని వీడిపోతుంటే బాబులో అసహనం పెరిగిపోతుంది. అందుకే ఏం మాట్లాడుతున్నారో...ఎలా మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండో రోజు నుంచే తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.


నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉంటే సీనియర్ నేతగా సలహాలు ఇవ్వాల్సిన బాబు....గుడ్డిగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న విమర్శలు చూస్తే, అర్ధం పర్ధం లేనివే ఎక్కువగా ఉంటాయి.  ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు విషయంలో బాబు ఎలాంటి విమర్శలు చేశారో అందరం చూశాం. జగన్ ఎలాంటి లొసుగులు లేకుండా  గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇస్తే...పేపర్ లీక్ అయిందని బాబు ఆరోపణలు చేశారు. వాటిని జనం గానీ, పరీక్షలు రాసి నిరుద్యోగులు గానీ నమ్మలేదు.


ఇక మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మద్యం షాపులు అన్నీ బంద్ చేశారు. కానీ బాబు మాత్రం మహాత్ముని జయంతి రోజున కూడా ప్రభుత్వ మద్యం విక్రయించిందని పనికిమాలిన విమర్శ ఒకటి చేశారు. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమపై ఏవో విమర్శలు చేస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందు వాటిని చదివి వినిపించారు.


అయితే బాబు వాటిని చదువుతుంటే చూసేవాళ్ళకే ఏవగింపు కలిగింది. ఈ విమర్శల్ని పక్కనబెడితే తాజాగా బాబు తన ఫ్రస్టేషన్ పోలీసులు మీద చూపించారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్న ముందుండే పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కొంత మంది పోలీసులు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తనకు ప్రతి ఒక్కరి జాతకం తెలుసని, తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని పోలీసులకే వార్నింగ్ ఇచ్చేశారు.


అయితే పోలీసులపైనే ఇలా విమర్శలు చేయడం పట్ల బాబు బాగా దిగిజారిపోయారనిపిస్తుంది. 14 ఏళ్ళు సీఎం, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తేనా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాల్సింది పోయి...మరి దిగజారిపోయి విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే బాబుకు మాత్రం ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: