ఏ ఊరు స‌మ‌స్య‌లు అక్క‌డే ప‌రిష్కారం చేసుకోవాలే.. చిన్న చిన్న‌వి మీరే చూసుకోండి.. కొంచెం పెద్ద‌వి అయితే.. మండ‌ల‌స్థాయిలో ప‌రిష్కారం దొర‌కుతుంది.. ఇంకా పెద్ద‌ది అయితే జిల్లా స్థాయిలో.. ఇక దీన్ని మించింది అయితేనే రాష్ట్ర‌స్థాయిలో నావ‌ద్ద‌కు రావాలి అనే ఆలోచ‌న‌తో ముందుకు సాగుతున్నార‌ట ఏపీ సీఎం జ‌గ‌న్. ఇంత‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌దిలో ఉన్న ఆలోచ‌న ఏంటీ.. ఆయ‌న ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకు తీసుకుంటున్న విధానం ఏంటో తెలుసుకుంటే షాక్ తినాల్సిందే.. ఇప్పటి దాకా ప్ర‌తి ప‌ల్లె స‌మ‌స్య పెద్దది చేసి దాన్ని రోజులు త‌ర‌బ‌డి పెండింగ్‌లో పెట్టి ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేసేవారు.


అంతే కాదు గ్రామంలో ప‌రిష్కారం అయ్యే స‌మ‌స్య ఎమ్మెల్యే వ‌ర‌కు తీసుకుపోయి స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టేదాక వెళ్ళేద‌ట‌.. దీనికి ముగింపు ప‌ల‌కాల‌న్న ఆలోచ‌న‌తోనే సీఎం జ‌గ‌న్ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు పునాదులు వేశారు. అందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే స‌చివాల‌యాల‌ను గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2న పురుడు పోశారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు సిబ్బందిని నియ‌మించారు. ఇక సిబ్బంది విధులు నిర్వ‌హించాలంటే స‌రైన చోటు ఉండాలి. సిబ్బందికి స‌చివాల‌యంలో స‌రైన వ‌స‌తులు ఉండాలి. దీనికి తోడు పక్కా భ‌వ‌నం కావాలి. అందుకు ప్ర‌తి స‌చివాల‌యంలో సొంత భ‌వనాలు ఉన్నాయో లేవో తెలియ‌దు.


ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కారం చేసేందుకు ఇక ముందు గ్రామ స‌చివాల‌య‌మే ప్ర‌జ‌లంద‌రికి దిక్కు. అందుకే ఇప్పుడు సీఎం జ‌గ‌న్ స‌చివాల‌యాల‌ను ప‌టిష్టం చేసేందుకు, సిబ్బందికి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేందుకు స‌చివాల‌య భ‌వ‌నాల నిర్మాణంపై దృష్టి సారించారు సీఎం జ‌గ‌న్‌. ఇప్ప‌టికే గ్రామాల్లో సొంత భ‌వ‌నాలు ఉంటే సిబ్బందికి స‌రిప‌డా వ‌స‌తులు ఉన్నాయో లేవో.. ఒక వేళ ఉన్నా.. అవి చాలీచాల‌ని భ‌వ‌నాలు అయి ఉంటాయి. అందుకే పాత భ‌వ‌నాలు ఉంటే వాటికి అద‌నంగా మ‌రో భ‌వ‌నం నిర్మించాలి. అందుకు స‌రిప‌డా నిధులుగా ఒక్కో అద‌న‌పు భ‌వ‌నానికి రూ.25ల‌క్ష‌లు కెటాయిస్తున్నారు సీఎం జ‌గ‌న్. ఇక భ‌వ‌నాలు ఉండి శిథిలావ‌స్థ‌కు చేరుకుంటే ఆ భ‌వ‌నాల‌ను నేల‌మ‌ట్టం చేసి కొత్త భ‌వ‌నం నిర్మిస్తారు దీనికి రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంగా నిర్ధారించారు.


ఇక ఈ భ‌వ‌నాలు నిర్మిస్తే గ్రామ స‌చివాల‌యంలోనే సిబ్బందికి సౌక‌ర్యాలు మెరుగుప‌డుతాయి.. గ్రామ స‌మ‌స్య‌లు ప‌రిష్కారంకు వేధిక ఉంటుంది. అందుకే గ్రామ స‌చివాల‌యాల‌కు మ‌హ‌ర్థ‌శ ప‌ట్టెలా చర్య‌లు తీసుకుంటున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. ఏ గ్రామంలో స‌చివాల‌యం లేదు అనే దుస్థితి రాకూడ‌దు. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ప‌రిష్కారం చూపే కేంద్రాలుగా విరజిల్లేలా సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు.. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఎక్క‌డ స‌చివాల‌యాలు లేవో.. ఎక్క‌డ ఉన్నాయో వాటిని జియో ట్యాంగింగ్ చేసేందుకు అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ పుర‌మాయించారు. ఇప్పుడు అధికారులు స‌చివాల‌యాల లెక్క తేల్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ట‌.. ఈ లెక్క తేల‌గానే నిధుల‌ను విడుద‌ల చేసి కొత్త గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప‌టిష్టంకు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోనున్నారు సీఎం జ‌గ‌న్‌.. !



మరింత సమాచారం తెలుసుకోండి: