కేసీఆర్ ఓ ఉద్య‌మ‌కారుడు.. కేసీఆర్ ఓ న‌డిచోచ్చే ఉద్య‌మనేత‌.. కేసీఆర్ ఓ ప‌రిపాల‌న ద‌క్ష‌త క‌లిగిన ధీరుడు.. కేసీఆర్ ఓ రాజ‌కీయ దురంధ‌రుడు.. కేసీఆర్ తెలంగాణ జాతిపిత‌.. ఇలా లెక్క‌లేని విధంగా పొగ‌డ్త‌లు.. లెక్క‌లేన‌న్ని బిరుదులు.. లెక్క‌లేన‌న్ని ఉపోద్ఘాతాలు.. లెక్క‌లేన‌న్ని చెముకులు.. ఇది తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను కీర్తించేవారి పొగ‌డ్త‌లు.. కానీ కేసీఆర్  ఓ నియంత‌.. కేసీఆర్ ఓ ఫ్యూడ‌ల్‌.. కేసీఆర్ ఓ ఉద్య‌మ ద్రోహి.. కేసీఆర్ తెలంగాణ ముసుగులో ప‌బ్బం గ‌డుపుకునే ఓ దొర‌.. బ్రిటీష్ పాల‌కుల‌కు ప్ర‌తిరూపం కేసీఆర్ అని అదే తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న గురించి తెలిసిన‌వారు విమర్శించిన విమ‌ర్శ‌లు.. ఇవి ఏవి నిజ‌మో.. ఏవి అబ‌ద్దమో కాని.. కేసీఆర్ ఉద్య‌మ నేత నుంచి అధికార పీఠం ఎక్కిన త‌రువాత అస‌లు రూపం తెలిసింద‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి.


అంత‌క‌న్నా ముందే తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న ఆమ‌ర‌ణ నిర‌హార‌దీక్ష‌ను విర‌మించి పండ్ల ర‌సం రంజుగా తాగిన‌ప్పుడే ఆయ‌న తెలంగాణ ద్రోహి అంటూ అస‌లు సిస‌లు తెలంగాణ వాదులు ఆరోపించారు. దిష్టిబొమ్మ‌లు త‌గుల‌బెట్టారు.. అయితే ఆనాడు కేసీఆర్‌ను తిట్టిన తిట్లే ఇప్పుడు అక్ష‌ర స‌త్యం అవుతున్నాయి.. వాస్త‌వానికి ఓ ఉద్య‌మ‌కారుడికి తోడి ఉద్య‌మ‌కారుల సాధ‌క‌బాధ‌కాలు తెలుస్తాయి.. ఓ కార్మికుడికి మ‌రో కార్మికుడికి తెలుస్తాయి.. ఓ పీడితుడికి మ‌రో పీడితుడి క‌ష్టం తెలుస్తుంది.. కానీ కేసీఆర్ లాంటి వారికి ఇవ్వ‌న్ని తెలియ‌వు అనేది ఆయ‌న‌తో సోప‌తి చేసిన తెలంగాణ వాదులు చెప్పేమాట‌లు..


అయితే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న నియంతృత్వ పోక‌డ‌లు, ఉద్య‌మాల‌ను అణ‌చాల‌నే ఆలోచ‌న‌, వేత‌నాలు పెంచాల‌ని కోరిన కార్మికుల‌ను ఉద్యోగం నుంచి తొల‌గించిన వైనం, స‌పాయి కార్మికులు జీతాలు పెంచ‌మంటే.. క‌మ్యూనిస్టుల అండ‌లో ఉద్య‌మిస్తున్నందుకు వారికి వేతనాలు ఇవ్వ‌న‌ని, అవ‌స‌ర‌మైతే విధుల నుంచి తొల‌గిస్తాన‌ని హెచ్చ‌రించిన తీరు ఆయ‌న‌లోని నియంకుశ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మాత్రం తెగించారు.. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్ళు త‌ప్ప అనే లోకోక్తిని మ‌ననం చేసుకున్న ఆర్టీసీ కార్మికులు ఉద్య‌మానికే న‌డుం భిగించారు.


ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు చేసిన విధంగా తెలంగాణ ఆర్టీసీని ప్ర‌భుత్వం ప‌రం చేసుకుని, ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌నే డిమాండ్‌తో ముందుకు దూకారు. కేసీఆర్ త‌న‌దైన ప‌ద్ద‌తిలోనే కార్మికుల న‌డుమ చిచ్చు పెట్టాల‌ని చూసారు.. కార్మికుల‌పై ఎస్మా ప్ర‌యోగిస్తాన‌ని హెచ్చ‌రించారు.. కార్మికులు విధుల్లో చేర‌కుంటే తొల‌గిస్తాన‌ని బెదిరించాడు.. ఇది ఓ హిట్ల‌ర్‌ను పోలిన నియంత లోని ల‌క్ష‌ణాల‌కు నిద‌ర్శ‌నం అని మేధావులు అంటుంటారు.. అయితే ఇప్పుడు కేసీఆర్ అచ్చుగుద్దిన‌ట్లుగానే ఆర్టీసీ కార్మికుల‌ను సామధాన‌బేధ దండోపాయాలు ప్ర‌యోగించారు. కానీ ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ వ‌దిలిన అస్త్రాల‌కు లొంగ‌లేదు.. ఉద్య‌మానికే సిద్ద‌మ‌య్యారు..


ఇంత‌కాలం కేసీఆర్ చేస్తున్న నియంత పోక‌డ‌ల‌కు బెంబెలెత్తిన రెవెన్యూ ఉద్యోగులు కూడా సిగ్గు ప‌డేలా ఆర్టీసీ కార్మికులు ఉద్య‌మిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల‌కు స‌బ్బండ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. అవ‌స‌ర‌మైతే తెలంగాణ బంద్‌కు కూడా స‌న్న‌ద్దం అవుతున్నారు అంటే కేసీఆర్ మీద ఎంత అగ్ర‌హం ఉందో తేట‌తెల్లం అవుతుంది. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆర్టీసీకి మ‌ద్ద‌తు ఇచ్చింది. జాతీయ స్థాయి కార్మిక సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి.. ఇక తెలంగాణ‌లోని రాజ‌కీయ ప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు కూడా ఆర్టీసికి సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌పై పోరుబాట‌కు సై అంటున్నాయి.. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మెను అణ‌చాల‌ని కేసీఆర్ చూస్తుంటే వారికి మ‌ద్ద‌తుగా బీజేపీ రంగంలోకి దూక‌బోతున్న సంకేతాలు వ‌స్తున్నాయి..


అంటే ఇప్ప‌టికే కేసీఆర్ పై ప్ర‌జాగ్ర‌హం పెల్లుబికుతుంటే.. ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కూడా ఆర్టీసీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డుతుండ‌టంతో కేసీఆర్‌కు క‌క్క‌లేక మింగ‌లేక పోతున్నారు. అంటే కేసీఆర్‌పై అటు ఉద్యోగ సంఘాలు, ఇటు రాజ‌కీయ ప‌క్షాలు, మ‌రోవైపు ప్ర‌జ‌లు మూకుమ్మ‌డి పోరుకు సిద్ద‌మ‌య్యార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.. కేసీఆర్ ఉద్య‌మ నాయ‌కుడిగా ఉద్య‌మాన్ని గౌర‌వించ‌కుండా అణిచివేత‌కు దిగ‌డంతో అది ఆయ‌న మెడ‌కే చుట్టుకుంది..


చివ‌రాఖ‌ర‌కు కేసీఆర్ చేసిన వ్య‌వ‌హ‌రం న‌చ్చ‌ని తెలంగాణ హైకోర్టు కూడా అసంతృప్తి వెళ్ళ‌గ‌క్కింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.. సో ఇలా ఆర్టీసీ కార్మికులు కోరిన కోర్కెల్లో కొన్నింటిని తీర్చినా అది అక్క‌డే స‌మ‌స్య స‌మిసి పోయేది..కానీ దాన్ని తెగేదాక లాగి ఇప్పుడు కేసీఆర్‌కు ఉద్య‌మ రుచి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.. దీనికి తోడు రాబోవు రోజుల్లో ఉద్య‌మాల‌కు ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఆద‌ర్శంగా నిలువ‌బోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: