’అమరావతిని దెబ్బతీశారు..అమరావతిని బతికించుకునే శక్తి నాలో ఉంది..రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథంలో నడిపిస్తా’..... ఇది చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. అసలు అమరావతిని దెబ్బతీయటమేంటో ? అసలు అమరావతిలో ఉన్నదేంటో ? చంద్రబాబుకే తెలియాలి. నిజానికి అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదు. అలాగే సిఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీసిందేమీ లేదు.

 

వాస్తవంగా చెప్పాలంటే అమరావతి స్పూర్తిని చంపేసిందే చంద్రబాబు. రాష్ట్రానికి కొత్త రాజధాని నగరాన్ని నిర్మించే అద్భత అవకాశాన్ని జనాలు చంద్రబాబుకు ఇచ్చారు. అయితే కమీషన్లకు కక్కుర్తిపడిన చంద్రబాబు భారీ అవినీతికి ప్లాన్ వేసి అమరావతి నిర్మాణాన్ని కాస్త భ్రమరావతిగా మార్చేశారు.

 

చంద్రబాబు సిఎం అయ్యేనాటికి రాష్ట్రం రూ. 16 వేల కోట్ల లోటు బడ్జోట్లో ఉంది. కాబట్టి చంద్రబాబు అనుకున్న ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ నగర నిర్మాణం సాధ్యం కానేకాదు. అందుకనే సింగపూర్ కంపెనీలకు ఏపి భవిష్యత్తును తాకట్టు పెట్టైన సరే అమరావతిని భారీగా నిర్మించాలని ప్లాన్ వేశారు.

 

అధికారంలో ఉన్న ఐదేళ్ళు కలల్లోనే ఉండిపోయి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి చివరకు నాలుగు నాశిరకం నిర్మాణాలను మాత్రం చేయగలిగారు. ఇందులో కూడా భారీ అవినీతికి పాల్పడ్డారు. అందుకే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు భవనాలు అంత ఘోరంగా ఏడుస్తున్నాయి.

 

నిజంగానే చంద్రబాబుకు ఇంగితం ఉండుంటే భ్రమల్లో ముణిగిపోయేవారే కాదు. రాజధాని అని చెప్పుకోవటానికి అవసరమైన అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు లాంటి శాస్వత భవనాలను మాత్రం కట్టేసి మిగిలిన అభివృద్ధిని ప్రైవేటు సంస్ధలకు వదిలేసుంటే సరిపోయేది.

 

అలా చేస్తే చంద్రబాబు ఎందుకవుతారు ? అందుకనే రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశాన్ని కంపు చేసుకున్నారు. నిజంగానే పైన చెప్పుకున్నట్లుగా చంద్రబాబు చేసేసుంటే ఇపుడు జగన్మోహన్ రెడ్డికి రాజధాని నిర్మాణాలపై ఆలోచించే అవకాశమే ఉండేది కాదు. చేజేతులా బంగారం లాంటి అవకాశాన్ని పొగొట్టుకున్న చంద్రబాబు అమరావతిని నిర్మించే శక్తి తనకే ఉందంటూ మళ్ళీ సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఈసారి రాజధాని నిర్మించే అవకాశం చంద్రబాబుకు వస్తుందా ? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: