ప్రజలకు ఏదో మేలు చేశామని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా హంగులూ ఆర్భాటాలు కల్పిస్తున్నామని చెప్పుకుని మురిసిపోవచ్చు.  సర్కార్ బస్సులు మెల్లగా ప్రైవేట్ రూట్ పట్టాయి. ఇపుడు ఏకంగా ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేసే ఎత్తులు జిత్తులూ ఓ వైపు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ రైల్వేస్ ని ప్రైవేట్ పరం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


దానికి నాందిగా దేశంలో యాభై రైల్వే స్టేషన్లు, 150 రైళ్లలను మొదటి దశలో ప్రైవేట్ పరం చేస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో దేశంలోని యాభై రైళ్ళను ఆధునీకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. మరి దానికి సరిపడా నిధులు లేనందువల్ల ప్రైవేట్ వైపుగా మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.  అదే విధంగా అత్యాధునిక సాంకేతిక సంపత్తిని కూడా రైళ్ళలో కల్పించాలన్నది కూడా చాలాకాలంగా అనుకుంటున్న మాటే.


దాని కోసం ప్రయోగాత్మకంగా  రైళ్ళను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెప్పాలని సూత్రప్రాయంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అయిదుగులు సభ్యులతో కూడిన కమిటీని  ఏర్పాటు చేసింది. అందులో  నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్  చైర్మన్ గా వ్యవహరిస్తారు.  కేంద్ర ఆర్ధిక,  పట్టణాభివ్రుధ్ధి శాఖల కార్యదర్శులు,రైల్వే ఫైనాన్షియల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు.


 
బిడ్డింగ్ ప్రక్రియను  పర్యవేక్షించడం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా  అవసరమైన నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుందంటున్నారు. ఏడాది పాటు పనిచేసే ఈ కమిటీలో కీలకమైన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా దేశంలో రైల్వేలను ఆధునీకరించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే అది ఎప్పటికపుడు ప్రతిపాదనగానే ఉంటోంది


ఈ దశంలో రైల్వేలను ఆధునీకరించే నిర్ణయం స్వాగతించాల్సినది అయినా కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే  రైల్వే ప్రమాదాలు ఏమీ తక్కువగా లేవు. ఈ దశలో ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రయాణీకుల భద్రత ప్రశ్నార్ధకం అవుతుందన్న మాట కూడా ఉంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిది కాదంటూ భారతీయ రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య విమర్శించడం ఈ సందర్భంగా గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: