మానవ సమాజంలో రోజురోజుకు బంధాలు అనుబంధాలు మంట కలిసిపోతున్నాయి. మనుషులు చివరకు కోర్కెలను అణుచుకోలేక వావివరసలు బంధాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. సొంత బంధువుల పైనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దారుణాలు మనం మరిచిపోకముందే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు తను పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థినులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన వెలుగుచూసింది. ఇదంతా జరిగింది ఏ కాలేజీలోనో కాదు పరమ పవిత్రమైన విశ్వవిద్యాలయంలో కావటం గమనార్హం.


తూర్పు గోదావ‌రి జిల్లా రాజమండ్రి లో ఉన్న నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఎంత చరిత్ర ఉందో తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విద్య నేర్పించాల్సిన ఓ ప్రొఫెసర్ నీచుడుగా మారిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో తన ప్లాట్‌కు పిలిపించి ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడ‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.


నన్నయ వర్సిటీలో ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సూర్యరాఘవేంద్ర ఈ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో రాఘవేంద్ర విద్యార్థుల‌కు పాఠాలు నేర్పుతానంటూ వారిని నేరుగా త‌న ప్లాట్‌కే పిలిపించుకుంటున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డ స్పెష‌ల్ క్లాసులు లాంటివి నిర్వ‌హించకుండా..... త‌మపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.


ఈ విష‌యం ఇప్పుడు విశ్వ‌విద్యాల‌యాల స‌ర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి దీనిపై నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు అంద‌డంతో పాటు ఆయ‌న నేరుగా విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో ఎలాంటి విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుందో ?  చూడాలి. ఇక ఇటీవ‌ల వ‌రుస‌గా ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌క విద్యాల‌యాల‌పై వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లే విక‌లాంగుల‌పై సైతం దాడులు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు లైంగీక వేధింపులు జ‌రిగిన‌ట్టే నేరుగా సీఎంకే ఫిర్యాదు అంటే వ‌ర్సిటీల్లో ప‌రిస్థితులు ఎలా ?  ఉంటున్నాయో ? అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: