జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఆయన గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్ వెళ్లి ,హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని, అక్కడి ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహరాజ్‌ను కలుసుకున్నారు. మాత్రి సదన్ ఆశ్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు స్వామి స్థానిక సంప్రదాయ తలపాగా చుట్టారు.ఉత్తరాఖండ్‌లో జనసేనాని అక్కడి పద్ధతిలో తలపాగాతో చాలా ప్రశాంతంగా కనిపించరు .

ఆయన వేషధారణ చూసిన  అభిమానులంతా  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఏ ప్రాంతంకి వెళ్లిన అక్కడ జీవన శైలి కానీ వాళ్ళ పద్దతులను అవలంబించటం ఆయనకు ఆయనే సాటి అంటున్నారు అభిమానులు.జనసేన  పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని పర్యటించి, ఆధ్యాత్మిక గురువు,గంగానది ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేసిన స్వామి నిగమానంద సమాధి ఈ ఆశ్రమంలో ఉండటంతో , జనసేనాని పవన్ కళ్యాణ్ సందర్శించి, నివాళులు అర్పించారు.

పవిత్ర గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానదిని పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కి ఉంది అన్నారు. దేశం లో నదులను కాపాడుకోవాలని అందరికి పిలుపునిచ్చారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్గాంచిన రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్ ని  కలిసి అగర్వాల్  గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.

  వెన్నునొప్పి బాధ ఇంకా తగ్గనప్పటికీ  అయన పిలుపు  మేరకు గురువారం హరిద్వార్ లో మాత్రి సదన్‌ ఆశ్రమం ని సందర్శించి అగర్వాల్ చిత్రపటానికి  నివాళులు అర్పించారు  పవన్. స్వామి శివానంద మహారాజ్ పవిత్ర గంగానదికి హారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: