హర్యానా ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి . ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హర్యానాలో అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి 24న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూపు మొత్తం హర్యానా ఎన్నికల పైనే ఉంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నిక జరుగనుంది. కాగా ప్రస్తుతం హర్యానాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 

 

 

 

 

 

 హర్యానాలో  లో మొత్తం 1.83 కోట్ల  మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనుండగా  ఉ... హర్యానా ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ను నియమించారు  . అయితే హర్యానాలో బిజెపి మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం లో రంగం లోకి దిగి దూసుకుపోతున్నారు. ఈసారి ఒక్క సీటు కూడా ప్రతిపక్షాలకు రానివ్వకుండా... మొత్తం 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా... ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరిస్తూ... ఎన్నికల తేదీ ఖరారు కాక ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జన్ ఆశీర్వాద్  యాత్ర కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు కాంగ్రెస్ ఇండియన్ నేషనల్  లోక్ దళ్, జన నాయక్ జనతా  పార్టీ, బహుజన్ సమాజ్,  ఆమ్ ఆద్మీ పార్టీలు... కూడా ప్రచార రంగంలోకి దిగాయి. 

 

 

 

 

 

 ఒకరికి మించి ఒకరు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కానీ హర్యానా ప్రజల చూపుము బిజెపి వైపే ఉన్నట్లు కనిపిస్తుంది.  దేశం మొత్తంలో మోదీ చక్రం తిప్పుతుండటం... గత పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం పది సీట్లను బిజెపికి గెలవడం... ఇలా ప్రతి విషయం లో బిజెపి పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే గత పార్లమెంట్ ఎలక్షన్ లు 10 కి 10 ఎంపీ సీట్లు గెలిచిన బిజెపి... ఈసారి కూడా భారీ విజయం సాధిస్తుందని దృఢనిశ్చయంతో ఉంది. అటు ప్రజలు కూడా బిజెపి వైపు మొగ్గు చూపుతున్న డంతో... మిగతా పార్టీలకు  గెలుపు  ఒక సవాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: