ఈ నెల 15వ తేదీన నెల్లూరులో ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. 15వ తేదీ ఏమిటి ? నెల్లూరు ఏమిటి ? అనేదే మీ డౌట్ కదు. అదే చెబుతున్నాం. ఈనెల 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు పర్యటనలు నెల్లూరు టౌన్లో ఒకేసారి జరగబోతున్నాయి. ఇద్దరు ఒకే రోజు ఒకే ఊరిలో కార్యక్రమాల్లో పాల్గొనటం ఇదే మొదటిసారి.

 

ఈ విషయంలోనే పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొదటి నుండి చంద్రబాబు, జగన్ మధ్య పరిస్ధితి ఉప్పు-నిప్పులాగే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.  మొన్నటి ఎన్నికల్లో జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బ తిన్నప్పటి నుండి ఇద్దరి మధ్య పరిస్ధితి మరింతగా క్షీణించింది. చీటికి మాటికి జగన్ ను టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

నిజంగా చెప్పాలంటే జగన్ ను చంద్రబాబు రెచ్చగొట్టటానికి చాలా రకాలుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కూడా అంతే వ్యూహాత్మకంగా సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇద్దరు అగ్రనేతలు నెల్లూరు టౌన్లో ఫేస్ టు ఫేస్ ఎదురుపడుతున్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ 15వ తేదీ ఉదయం నెల్లూరుకు చేరుకుంటారు. కార్యక్రమం అంటే ఎలాగూ బహిరంగసభ ఉంటుంది.

 

అదే సమయంలో చంద్రబాబు కూడా నెల్లూరులోనే ఉంటారు. జిల్లాల పర్యటనలో భాగంగా 14, 15 తేదీల్లో చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు పెట్టుకున్నారు. ఇద్దరు ఒకే సమయంలో నగరంలో ఉంటే శాంతి భద్రతలకు ఇబ్బందులు వస్తాయనే టెన్షన్ పోలీసుల్లో పెరిగిపోతోంది.

 

అందుకనే తన కార్యక్రమాన్ని నెల్లూరులో కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోమని పోలీసు అధికారులు చంద్రబాబును రిక్వెస్ట్ చేశారట. అయితే పంతం కోసమో లేకపోతే ఇంకేదైనా హిడెన్ అజెండా ఉందో తెలీదు కానీ చంద్రబాబు మాత్రం ప్రోగ్రామ్ ను మార్చుకోవటానికి ఇష్టపడటం లేదు. అందుకనే ఆరోజు ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: