మనకు అప్పుడప్పుడు కొన్ని వింత జీవులు కనిపిస్తుంటాయి . మనకు కనిపించేవి వింత జీవులు కానప్పటికీ... మనం మొదటి సారి చూసి వాటిని వింత జీవులు ఏమో అనుకుంటాం . ఇక అలాంటి జీవి మన ఇంట్లో ఉందని తెలిసింది అనుకోండి... ఏదో గుడి కి బయలుదేరినట్టు  అందరూ మన ఇంటికి వచ్చి  ఆ వింత  జీవిని  ఎగబడి చూస్తుంటారు . ఇక్కడ కూడా అలాగే జరిగింది. కరీంనగర్ లోని ఓ ఇంట్లో ఓ వింత క్షిదరం  ప్రత్యక్షమైంది. దీంతో దాన్ని చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. 

 

 

 

 

 అలుగు  లేదా పొలుసులు  పిపీలికారి  అని పిలువబడే కరీంనగర్  కరీంనగర్ జిల్లాలో ఓ  ఇంట్లో కనిపించింది. కాగా  ఈ జీవిని శాస్త్రీయ నామం లో పాంగొలిన్ అంటారు. అయితే క్షీరదం  ప్రత్యేకత ఏమిటంటే దానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆత్మరక్షణకోసం వింతగా ప్రవర్తిస్తుంది. తనకు అపాయం కలుగబోతుందని గ్రహించిన ఈ క్షీరదం వెంటనే గుండ్రంగా వలయాకారంలో ముడుచుకొని పోతుంది. అలా ఈ జీవి  ప్రమాదం నుండి ఆత్మ  రక్షణ కల్పించుకుంటుంది.

 

 

 

 

 

 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కరీంనగర్ రోడ్డు లో రోడ్డులో ఓ ఇంట్లో ఈ క్షీరదం  కనిపించింది. ఆ ఇంట్లో వింత జీవి ఉందని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు... దాన్ని  చూడడానికి ఎగబడ్డారు. దీంతో ఈ సమాచారం కాస్త ఫారెస్టు అధికారుల వరకు వెళ్లడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు... ఆ అడవి అలుగును  సురక్షితంగా దగ్గర్లోని అడవిలో వదిలేసారు. అంతరించిపోతున్న క్షీరదాల జాబితాలో ఈ జాతి ఒకటని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: