వజ్రం లోపల మరో వజ్రం ఏమిటి అని అనుకుంటున్నారా.. ఇది నిజం  మన భూమిలో అరుదుగా కనిపించేవి వజ్రాలు. ఈ వజ్రం పేరు Matryoshka diamond. అలాంటి వజ్రాలవాటిలో... ఓ వజ్రం లోపల మరో వజ్రం ఉండటం చాలా అత్యంత అరుదుగా లభిస్తాయి. ఎంత అరుదంటే... ఇలాంటి డైమండ్ కనిపించడం ఇదే మొదటి సరి అని చెప్పాలి. దీన్ని సైంటిఫిక్ భాషలో మాట్రియోష్కా డైమండ్ అని అంటారు. రష్యా... సైబీరియాలోని ఓ గనిలో ఈ వజ్రంని కనిపెట్టారు.

ఇందులోని చిన్న వజ్రం... అటూ ఇటూ కదులుతోందని రష్యా స్టేట్ మైనింగ్ కంపెనీ అల్రోసా PJSC తెలియచేసారు. ఇంతకీ ఈ డైమండ్ ఎప్పుడు పుట్టిందో తెలుసా. 80 కోట్ల సంవత్సరాల కిందటిది. దీని బరువు 0.62 కేరట్లు ఉంది. ఇందులోపల ఉన్న వజ్రం బరువు 0.02 కేరట్లు ఉండడం గమనార్థకం.


ఇప్పటివరకూ కొన్ని వందల గనుల్లో వజ్రాల తవ్వకాలు జరిగాయి కానీ. దొరికిన ప్రతి డైమండ్‌నీ రికార్డ్ చేశారు. ఐతే... ఎప్పుడూ ఇలాంటి వజ్రం కనిపించకపోవడం చాలా విశేషం.ఇక సాధారణంగా ఏ వజ్రమైనా లోపల ఖాళీ అన్నది ఉండదు. ఏదో ఒక ఖనిజం అందులో చేరిపోతుంది.కానీ ఈ డైమండ్లో  మాత్రం లోపల ఖాళీగా ఉంది. అదే సమయంలో... ఓ చిన్ని వజ్రాన్ని తనలో దాచుకుంది. పెద్ద వజ్రాన్ని అటూ ఇటూ కదుపుతుంటే... చిన్న వజ్రం కూడా అటూ ఇటూ కదులుతుంది అంటే నమ్మండి.


ప్రస్తుతం ఈ డైమండ్‌ను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జియోలాజికల్ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థకు పరిశోధన చేయడం కోసం ఇచ్చారు. సైంటిస్టులు దీన్ని స్పెక్ట్రోస్కోపీ (spectroscopy), ఎక్స్‌రే మోక్రోటోమోగ్రఫీ (X-ray microtomography) వంటి విధానాలతో పరిశోధన చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ల అంచనా ప్రకారం... ముందుగా చిన్న డైమండ్ పుట్టింది. ఆ తర్వాత దానిచుట్టూ పెద్ద డైమండ్ పుట్టింది అని అంటున్నారు. ఈ రెండింటి మధ్యా... ఖాళీ గ్యాప్ ఏర్పడటమన్నది ఆసక్తికర అంశం అని వాళ్లు తెలియచేసారు. త్వరలో దీన్ని అమెరికాలోని జెమొలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌కి కూడా పరిశోధనల కోసం పంపాలి అని అనుకుంటున్నారు అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: