తల్లి తండ్రి గురువు దైవం అంటే ఎవరి జీవితంలోనైనా ముందు తల్లి, తరువాత తండ్రి , ఆ తరువాత గురువు చివరకు దైవం అని అర్థం. తల్లి తండ్రి తరువాత అంత గొప్ప స్థానం కేవలం గురువుకు మాత్రమే ఉంది. కానీ కొందరు గురువులు మాత్రం ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురువులు ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నారు. 
 
వైయస్ రాజశేఖర్ రెడ్డి కోల్ కతా చెన్నై జాతీయ రహదారిలోని రాజానగరం వద్ద నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. రాజానగరంలోని క్యాంపస్ లో 2,200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ వర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
అక్కడ చదువుతున్న విద్యార్థినులు ఎవరికైనా ఫిర్యాదు చేయాలని అనుకున్నా ఉన్నతాధికారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ నే వెనకేసుకొస్తూ ఉండటంతో విద్యార్థినులు మౌనం దాల్చారని తెలుస్తోంది. సూర్య రాఘవేంద్ర స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినులను ఫ్లాట్ కు రప్పించుకొని లైంగిక వేధింపులకు గురి చేశాడని కొందరు విద్యార్థినులు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 
 
సీఎం జగన్ తక్షణమే ఈ ఘటన గురించి విచారణకు ఆదేశించారు. సూర్య రాఘవేంద్ర వేధింపులు మితిమీరిపోవటంతో ఐదుగురు విద్యార్థినులు సీఎంకు లేఖ రాయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేఖలో విద్యార్థినులు లైంగిక వేధింపుల గురించి పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. వర్సిటీ అధికారులు మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థినులు ఎవరైనా పై అధికారులకు ఫిర్యాదు చేయటానికి ప్రయత్నిస్తే ప్రాజెక్టులు ఆపేస్తానని పాస్ కాకుండా చేస్తానని ప్రొఫెసర్ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వీసీ తనకు బాగా క్లోజ్ అని చెబితే మీకే నష్టమని ప్రొఫెసర్ బెదిరింపులకు దిగటంతో విద్యార్థినులు వీసీకి ఫిర్యాదు చేయటానికి వెనుకడుగు వేసారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: