హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు ప్రారంభం కానున్నాయి ..సీఎం కేసీఆర్  రెండో సారి అధికారం చేపట్టాక ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు.. ఆ నియోజకవర్గంలో గెలుపుకు అవకాశం కల్పిస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డికే మరోసారి టికెట్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో షాక్ తగలడంతో, ఈ ఉప ఎన్నికలోనైనా పరువు నిలబెట్టుకోవాలని కెసిఆర్ పక్కాప్లాన్  చేస్తున్నారు అని సమాచారం.


టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సైదిరెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయినా, పార్టీ గెలుపుపై కేసీఆర్‌కు  పూర్తి నమ్మకం కలగడం లేదని  తెలిపారు . పైగా ఈ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడం, వారిని తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం లాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇవి పార్టీ గెలుపును భారీగా దెబ్బ తీస్తాయని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యంగా కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిసినా.. దసరా వేళ సరిపడా బస్సులు నడవకపోవడం, దాని వల్ల  చాలా మంది  ప్రయాణికులు ఎదుర్కొన్న  తీవ్ర సమస్యలు ,ప్రభుత్వంపై  భారీ అసహనానికి దారి తీశాయని చెప్పుకొచ్చారు.



అయితే  ఇదంతా  రికవరీ  చేయటానికి టీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా  మంచి పేరున్న.. ఆర్థిక మంత్రి హరీష్ రావును నేరుగా రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా సందర్భాల్లో, చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన హరీష్  రావు అయితే.. ఓటర్లను ఆకట్టుకోగలరని, తన వాక్చాతుర్యం  తో ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టగలరని భావించి సీఎం ఆయన్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: