దేశంలోని 64 నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి.  అందులో ఒకటి తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజక వర్గం.  ఈ నియోజక వర్గానికి ఎన్నికలు అక్టోబర్ 21 వ తేదీన జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు ప్రచారాన్ని సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ప్రచారం చాలా వరకు పూర్తి చేశారు.  అధికారంలో ఉన్న తెరాస పార్టీకి చెందిన క్యాడర్ చాలా వరకు హుజూర్ నగర్లోని ఉండి ప్రచారం చేస్తున్నది. 


తెరాస పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.  ఈ విషయంలో బీజీపీ, తెలుగుదేశం పార్టీలు వెనకబడి ఉన్నాయి. బీజేపీ కి చెందిన స్థానిక నాయకులు ఏక్కడ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చి ప్రచారం చేయడానికి అవకాశం లేదు.  ఎందుకంటే, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల ప్రచారంలో ఈ నేతలు బిజీగా ఉన్నారు.  కాబట్టి జాతీయ స్థాయి నేతలు రాకపోవచ్చు.  


అయితే, తెలుగుదేశం పార్టీ తరపున బాలయ్యబాబు హుజూర్ నగర్లో ప్రచారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  చంద్రబాబు కూడా దీనికి ఒకే చెప్పారు.  ఐదారు రోజులపాటు బాలయ్యబాబు అక్కడే ఉండి ప్రచారం చేస్తారని టాక్.  అయితే, ఈనెల 18 వ తేదీ నుంచి బాలయ్య తన 105 సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.  ఈ లోపుగానే బాలయ్య తన ప్రచారాన్ని పూర్తి చేయాలి.  ఐదారు రోజులపాటు ప్రచారం చేస్తారని బాబు చెప్తున్నారు.  అంటే, కనీసం రేపటి నుంచి బాలయ్య హుజూర్ నగర్ నియోజక వర్గంలో ప్రచారం చేయాలి.  


అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎదో నిలబెట్టాం కదా అని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా తీసుకొని అభ్యర్థులకోసం ప్రచారం నిర్వహిస్తే.. పార్టీ కొంతమేర బలం పుంజుకుంటుంది.  వారానికి ఒకరోజు మాత్రమే కాకుండా కనీసం రెండు మూడు రోజులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమయం కేటాయించాలి.  అప్పుడే పార్టీ తెలంగాణలో బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: