హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో  అన్ని పార్టీల్లో హైటెన్ష‌న్ నెల‌కొంది. పో లింగ్ కు ఇక పది రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉండడంతో ఆయా పార్టీల అగ్ర నేతలు హుజూ ర్‌న‌గ‌ర్ బాట ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారిం ది. హుజూర్‌న‌గ‌ర్‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ఆ రెండు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్ర‌మిస్తోంది.


మ‌రోప‌క్క టీఆర్‌ఎస్‌ పార్టీ హుజూర్‌న‌గ‌ర్‌లో ఎలాగైనా గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని త‌హ‌త హ‌లా డుతోంది. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓట‌మి పాలవ‌డంతో ఈసారి ఈ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. పార్టీ ఇంచార్జి పల్లా రా జేశ్వర్‌రెడ్డి, స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి నే తృత్వంలోని గులాబీ దళం గ్రామాలను చుట్టివస్తోంది. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సామాజిక వర్గాల వారీగా విభజించుకుని మరీ ప్రచారం చేస్తున్నారు.


ఇక సీపీఐ మ‌ద్ద‌తుతో వి జ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఇటీవ‌ల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి క‌లిసి వ‌స్తున్నాయి. హుజూర్‌న‌గ‌ర్‌లో త‌న భార్య, కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి రెడ్డికి విజ‌యావ‌కాశాల‌ను మెరుగు ప‌రుస్తున్నాయి.  రోజురోజుకు ఉధృత‌మ‌వుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మె అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

కాంగ్రెస్‌తో స‌హా టీజేఎస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్ర‌సీలాంటి పార్టీలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం, స‌మ్మె రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుండ‌టంతో అధికార పార్టీలో ఆందోళ‌న మొద‌లైంది.అంతేగాక ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒకేసారి యాబైవేల మంది ఆర్టీసీ కార్మికుల‌ను తొల‌గించ‌డంపై ఆగ్ర‌హ జ్వాల‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ ప్ర‌భావం ఖ‌చ్చితంగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌పై ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మ‌రోప‌క్క తొలుత టీఆర్ ఎస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సీపీఐ ఇప్పుడు మ‌ద్ద‌తుపై పున‌రాలోచ‌న‌లో ప‌డ‌టంతో గులాబీ శిబిరంలో ఆందోళ‌న నెల‌కొంది. ఒక్కో ఓటు కీల‌కంగా మారుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో అధికార పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుండ‌టం.. ప్ర‌తిప‌క్షాల‌న్నీ జ‌ట్టు క‌ట్ట‌డం లాంటి ప‌రిణామాలు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు లాభిస్తాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: