భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమిళనాడులోని చెన్నై శివారులో ఉన్న చారిత్రక తీరప్రాంతం మహాబలిపురంలో నేడు సమావేశం . రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు జిన్‌పింగ్ చెన్నై చేరుకుంటారు. ఆ తర్వాత 4.55 కు మహాబలిపురంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు అని సమాచారం.


ఆ తర్వాత  మహాబలిపురంలోని  తీరప్రాంత ఆలయాలు, అర్జునుడి తపస్సు శిల్పం, కృష్ణుడి వెన్న బంతి లాంటి పర్యటక ప్రదేశాలను ఇద్దరు సందర్శిస్తారు. మరి, భారత ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన  ముంబయి నగరాన్ని కాదని, ఈ సమావేశానికి మహాబలిపురంను ఎంచుకోవడానికి గల కారణాలు చూద్దామా మరి...ఇక చెన్నై నగరం నుంచి ఈస్ట్‌ కోస్ట్ రోడ్డులో 62 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం ఉంది. పల్లవుల కాలం నాటి ఏకశిలా రథం, అరుదైన శిల్పాలు, గుహ ఆలయాలు లాంటి యునెస్కో వారసత్వ ప్రదేశాలున్న మహాబలిపురం, తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మహాబలిపురం.


ఇక  భద్రత కచ్చితంగా  చూసేందుకు 500 మందికి పైగా పోలీసుల సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 20 లోపే చైనా రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు మహాబలిపురంను సందర్శించడం జరుగుతుంది అని స్థానిక మీడియా తెలిపింది. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం గత బుధవారం మహాబలిపురంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.


ఇక అసలు విషయానికి వస్తే  భారతదేశ విదేశీ వ్యవహారాల విషయంలో తమిళనాడుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్నదానికి విదేశాంగ శాఖ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని అనుకుంటున్నారు. గతంలో 2018 ఏప్రిల్ 27న ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ చైనాలోని ఉహాన్‌లో సమావేశం అయ్యారు. 2017లో డోక్లాం వివాదం తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలు ఆ సమావేశం తర్వాత ఉద్రిక్తతలు తగ్గాయి. అనంతరం ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న సమావేశం ఇదే.


"భారతదేశం సార్క్ దేశాల కంటే, బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాలపై దృష్టి పెట్టాలని అనుకుంటోంది. బంగాళాఖాతంలోనూ తన ఆధిపత్యాన్ని చుపియించాలని అనుకుంది. అందుకే బంగాళాఖాతం తీరంలో ఉన్న ప్రాంతాన్ని ఈ సమావేశం కోసం ఎన్నుకున్నారు" అని తన్నాచి తమిజాగం కో-ఆర్డినేటర్, "పుతియా వల్లరసు చైనా" పుస్తకం రచయిత, ఆళి సెంథిల్ నాథన్ తెలియచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: