సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారితే పథకాల పేర్లు, ప్రభుత్వ భవనాల రంగులు, , బస్సుల రంగులు మారుతాయనే విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన ప్రతి ప్రతి రాష్ట్రంలోను ఇది చాలా సాధారణంగా జరిగే విషయంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసింది. ఉద్యోగాలలో ఎంపికైన వారు గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. 
 
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేస్తున్న విషయం తెలిసిందే. గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ పార్టీ జెండా రంగును వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నుండి విమర్శలు వినిపించాయి. ఇలాంటి సమయంలో కృష్ణా జిల్లాలో దుందిరాలపాడు అనే గ్రామంలో ఒక వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. 
 
కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలోని గ్రామ సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ రంగులను వేయటం జరిగింది. కానీ ఆ గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు గ్రామ సచివాలయానికి పసుపు రంగు వేసేందుకు ప్రయత్నం చేశారు. గ్రామ సచివాలయ భవనంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండగా జగన్ ఫోటో స్థానంలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీయార్ ఫోటోను అతికించారు. 
 
ఈ విషయం వైసీపీ కార్యకర్తలకు తెలియటంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కొంత సమయం పాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని తెలుస్తుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవను ఆపారు. ఆ తరువాత గొడవలో పాల్గొన్న 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేసారని తెలుస్తోంది. 






మరింత సమాచారం తెలుసుకోండి: