ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ సచివాలయం వ్యవస్థను 2003లో మేమే పెట్టామని, కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమే ప్రారంభించామని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటోందని అన్నారు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు ఆలోచన సరళి బాలేదని బొత్స అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 పథకాలు ఎవరు తెచ్చారని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం అభియోగం వచ్చిన సొంత ఎమ్మెల్యేపైనే కేసు పెట్టిందని అన్నారు. మీ హయాంలో ఎంతమంది శాసనసభ్యులపై కేసులు నమోదయ్యాయని, ఎంతమందిని మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని బొత్స ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ పై ఒక్క కేసు అయినా నమోదు చేశారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 
 
టీడీపీ ఎంపీ సాక్షాత్తూ ఐపీఎస్ అధికారిపైనే దాడికి దిగారని ప్రశ్నించారు. కాల్ మనీ కేసులో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని బొత్స ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి మీకు ఎప్పుడు భయపడ్డారని బొత్స  ప్రశ్నించారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో సకాలంలో అప్పులు తీర్చకపోవటం వలన ఎస్బీఐ నుండి అప్పుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. 
 
గత ఐదు సంవత్సరాలలో టీడీపీ ప్రభుత్వ పరిపాలన వలన 13 జిల్లాల ప్రజలు నష్టపోయారని అన్నారు. రాష్ట్ర విభజన వలన జరిగిన అన్యాయం కంటే గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ వలన ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. వైసీపీ పార్టీకి ఒక పద్దతి ఒక విధానం ఉందని అన్నారు. చంద్రబాబు ఎన్ని శాపాలు పెట్టినా వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటమే అని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: