ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోర్బ్స్  సంపన్నుల జాబితా  వచ్చేసింది. 2018 సంవత్సరానికి గాను ఇండియా లోని  సంపన్నుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్  మ్యాగజైన్ . ఈ ఫోర్బ్స్ జాబితాలో  ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా...  అపర కుబేరుడు గా పేరొందిన ముఖేష్ అంబానీ మొదటి స్థానం  దక్కించుకున్నాడు. కాగా  ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో 12వ సారి మొదటి స్థానంలో నిలువడం  విశేషం.  51.4 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ  ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. జియో  రాకతో ముఖేష్ అంబానీ సంపద  మరింత పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది . 

 

 

 

 

 కాగా గతేడాది ఫోర్బ్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న అజీమ్ ప్రేమ్ జీ... ఈ ఏడాది ప్రకటించిన ఫోర్బ్స్ సంపన్నుల  జాబితాలో 17వ స్థానానికి  పడిపోయారు.. కాగా ఈ ఏడాది పలు స్వచ్ఛంద కార్యక్రమాల కోసం విరాళం ఇవ్వడంతోనే అజీమ్ ప్రేమ్ జీ సంపద కాస్త తగ్గిందని సమాచారం. ఏడాది ఫోర్బ్స్ జాబితాలో  రెండవ స్థానంలో  అదానీ ఫోర్బ్స్  అధినేత గౌతం అదానీ  రెండవ స్థానంలో నిలిచారు. 15.7 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ  ఫోర్స్ అధినేత గౌతం అదానీ  రెండవ స్థానంలో నిలిచారు. ఇక అంబానీ, అదాని తర్వాత మొదటి ఐదు స్థానాల్లో  అశోక్ లేలాండ్ యజమానులు హిందూజా బ్రదర్స్, పల్లోంజీ  గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ , ఉదయ్ కొటక్ లు  నిలిచారు. కాగా  ఫోర్బ్స్  మ్యాగజైన్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మొదటి 5వ స్థానంలో చోటు దక్కించుకోవడం ఉదయ్ కొటక్ కి  ఇదే మొదటిసారి. 

 

 

 

 

 

 ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఓ  ఉపాధ్యాయుడు చోటు సంపాదించుకున్నారు. సాధారణ టీచర్ గా పనిచేసిన రవీంద్రన్ ... వినుత్న ఆలోచనతో బైజూస్ స్మార్ట్ లర్నింగ్ యాప్  ప్రారంభించి 7 ఏళ్లలోనే బిలియనీర్ గా  ఎదిగాడు. ఇక ఇప్పుడు తాజాగా ఫోర్స్ సంపన్నుల జాబితాలో 1.91 బిలియన్ డాలర్ల సంపదతో  72వ స్థానం దక్కించుకున్నారు బైజూస్  అధినేత రవీంద్రన్ బైజూస్ . కాగా రవీంద్రన్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఈ ఫోర్బ్స్  సంపన్నుల జాబితాలో మరో ఆరుగురు కొత్త వారికి కూడా చోటు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: