తెరాస పార్టీ ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో హుజూర్ నగర్లో పోటీకి దిగింది.  దాదాపు సగం క్యాడర్ హుజూర్ నగర్లోని ఉండి ప్రచారం చేస్తున్నది.  కొన్ని రోజుల క్రితం వరకు తప్పకుండా తెరాస గెలుస్తుందని అనుకున్నారు.  కానీ, ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారో అప్పటి నుంచి హుజూర్ నగర్ లో పరిస్థితులు మారిపోసాగాయి.  గతంలో తెరాస పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిపిఐ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని చెప్పేసింది.  


కార్మికుల కోసం పుట్టిన పార్టీ కాబట్టి తమ కార్మికులకు అండగా ఉండేందుకు, వాళ్లతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ మరోసారి చెప్పడం విశేషం.  అయితే, తెరాస పార్టీ మాత్రం తమదే గెలుపు అని గట్టిగా చెప్తున్నది.  తెరాస పార్టీకి చెందిన నేతలు అక్కడే ఉంది పరిస్థితులకు తగ్గట్టుగా ప్రచారం చేస్తున్నారు.  ఎప్పుడైతే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్మికులకు మద్దతు తెలుపుతూనే.. హుజూర్ నగర్లో ప్రచారం చేస్తున్నది.  అభివృద్ధి కావాలాంతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, ఒక ఉపఎన్నిక కోసం తెరాస పార్టీ భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, ఎన్నికల్లో డబ్బులు పంచడానికి డబ్బులు ఉన్నాయిగాని, కార్మికులకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.  


ఎవరెలా ప్రచారం చేసినా అంతిమంగా తమదే విజయం అని కాంగ్రెస్ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తున్నది.  అన్ని పార్టీలు కూడా హుజూర్ నగర్ లో విజయం సాధించాలని ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఆర్టీసీ కార్మికులు తెరాస పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో ప్రజల్లో ఆలోచనల్లో పడ్డారు.  బంగారు తెలంగాణ కోసం ఓట్లేసి గెలిపిస్తే.. ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో మిగతా ఉద్యోగులపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకోరు అనే గ్యారెంటీ లేదని ప్రజలు భావిస్తున్నారు.  


ఎన్నికలు జరగడానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉన్నది.  ఈలోపుగా ఆర్టీసీ కార్మికుల సమస్య ఒక కొలిక్కి వస్తే తెరాస విజయానికి మార్గం సుగమం అవుతుంది.  లేదంటే గెలుపు అంతటి ఈజీకాదు.  గతంలో అక్కడి కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది.  మరోవైపు ఆ ప్రాంతంలో బీజేపీ కూడా బలంగా ఉన్నది.  ఈ రెండు పార్టీల మధ్యనే గతంలో పోటీ ఉన్నది.  ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేలా కనిపిస్తోంది.  అందుకోసమే తెరాస పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: