ఏపీలో రాజకీయంగా బలోపేతం అవ్వాలని భావిస్తున్న బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా ఏపీకి కీలకమైన పోలవరం మీద బీజేపీ నేతలు కొత్త ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన కేంద్రం.నిధులు మాత్రం రీయంబర్స్ చేస్తోంది. అయితే, ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ప్రజల్లో ఇమేజ్ పెరగాలంటే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత నిధులు ఇస్తూ.ఆ క్రెడిట్ ఏపీ ప్రభుత్వానికే దక్కుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

దీంతో ఆ ప్రాజెక్టు బాధ్యతలను కేంద్రమే తీసుకుంటే తమకు కలిసి వస్తుందనే ఆలోచన మొదలైంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఇదే పోలవరం కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేసారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రం పోలవరం రాష్ట్రమే పూర్తి చేస్తుందని తేల్చి చెప్పారు. దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను గమనించిన బీజేపీ ఇప్పుడు కొత్త నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది.దీని వెనుక లాభ నష్టాలను అంచనా వేస్తోంది.

 

కేంద్రం పైన బీజేపీ నేతల ఒత్తిడి..ఏపీలో పార్టీ ఎదగాలంటే రాష్ట్రం కోసం కేంద్రం ఏ రకంగా అండగా నిలిచిందీ చెప్పుకోవటంలో ఇప్పటి వరకు విఫలమయ్యామనే భావనలో బీజేపీ నేతలున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాము చేసిన సాయం గురించి ఎక్కడా చెప్పకుండా చివరకు బీజేపీ మోసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఫలతంగా ఏపీ ప్రజల్లో బీజేపీ దోషిగా నిలబడింది.తిరిగి ఇప్పుడు కూడా అదే మరోసారి జరగకుండా కేంద్రం నిధులతో ఏపీలో అమలు చేస్తున్న ప్రాజెక్టులను కేంద్రమే స్వయంగా నిర్వహించాలనే ఆలోచన ఏపీ బీజేపీ నేతల్లో మొదలైంది. దీని ఫలితంగానే ఇప్పుడు బీజేపీ నేతలు కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు.అందులో ఇప్పుడు పోలవరం పైన నేతలు ఫోకస్ చేస్తున్నారు.చూద్దాం ఇలానే జగన్ మీద కన్నెస్తే బీ.జే.పి పార్టీ గెలుస్తుందా లేక లోకల్ ఎప్పుడు లోకలే అని జగన్ నిలువ నున్నాడో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: