ఆర్టీసీ కీలక నిర్ణయాల పట్ల మహిళా కార్మికుల పరిస్థితిని తెలియచేశారు. వారిలో ఒకరు ఇలా.... "నా భర్త చనిపోయాక ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. గత 19 సంవత్సరాల నుంచి నేను దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాను. నా ఇద్దరు బిడ్డలను ఇదే ఉద్యోగం భరోసాతో చదివించి పెంచి పెద్ద చేశాను. వాళ్లకు పెళ్లిళ్లు చేయాలి ఇంకా. 


ఇప్పుడు ఆర్టీసీ సంస్థను ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరితే మీ ఉద్యోగాలు లేవు పోండి అంటే ఎలా? మా కాళ్లకి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీసేస్తా అన్నది ఈ కేసీఆరే కదా. ఇప్పుడు ముళ్లు కాదు కదా.. గునపాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు" అని తమ ఆవేదన వ్యక్తం చేశారు షబ్నమ్ అనే ఆర్టీసీ ఉద్యోగిని. షబ్నమ్ ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 5,100 మంది మహిళా కార్మికులలో ఒకరు ఈమె.


అయిదో రోజుకు చేరుకున్న సమ్మె గురించి ప్రముఖ మీడియాతో మహిళా బస్సు కండక్టర్లతో మాట్లాడి వారి ప్రతిపాదనలు, ప్రభుత్వం వైఖరిపై వారి అభిప్రాయాలను తెలియచేశారు. ఆర్టీసీలో 5,100 మహిళా ఉద్యోగులు ఉన్నారు. అందులో దాదాపు 4,900 మంది బస్సు కండక్టర్లుగా పని చేస్తున్నాము అని  తెలంగాణ మజ్దూర్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఉష తెలిపారు.


ఇంకొక ఉద్యోగి కౌసల్య ఇలా చెప్పుకొని  వచ్చారు "మాకు జీతాలు చాలా వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు. మరి అంత జీతాలు వస్తున్నా నాలాంటి వారు ఎంతో మంది అదనపు షిఫ్టులు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు సిటీలో వానపడినా, ట్రాఫిక్‌లో ఇరుక్కుని గంటలు గంటలు షిఫ్ట్ అయిపోయాక కూడా పని చేస్తున్నాము  మేము. మా షిఫ్ట్ అయిపోయింది అని డ్యూటీ మధ్యలో నుంచి వెళ్లిపోం కదా. ప్రజల్ని వారి వారి గమ్య స్థానానికి జాగ్రత్తగా చేర్చి వెళ్తున్నాం కదా" అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: