నగరంలో భారీ వర్షాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కావడంతో... నగర పరిస్థితి అధ్వానంగా తయారైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం స్తంభించి పోతుంది. ఇక చిన్నపాటి వర్షానికి జలమయం అయ్యే  రహదారులు... భారీ వర్షాలు కురుస్తుండడంతో పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు . దానికి తోడు నగరంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉండటంతో చెరువుల్లో మారిన  రహదారుల పైనే  ట్రాఫిక్ క్లియర్ అయ్యేంతవరకు పడిగాపులు కాస్తున్నారు వాహనదారులు . 

 

 

 

 

 

 ఇక మొన్నటి వరకు ఓ సారి వర్షం  పడితే బాగుండు అని అనుకున్న నగర వాసులు ... ఇప్పుడు పడుతున్న వర్షాలు చూసి... వర్షం పేరు ఎత్తితే చాలు అయ్యా బాబోయ్ మళ్ళీ వర్షమా  అంటూ  బెంబేలెత్తుతున్నారు. ఇక వర్షం పడ్డప్పుడు రహదారులపై నడిచే ప్రజలు,  వాహనదారుల పరిస్థితి ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వెళ్లాల్సి  వస్తుంది. ముందే గతుకుల రోడ్లు ఇక రోడ్డు నిండా భారీ వర్షాలతో వరద  నీరు చేరడంతో ఎక్కడ ఎలాంటి గతుకులు ఉన్నాయో  కూడా కనిపించని పరిస్థితి. దీంతో గతుకుల రోడ్డుపై వరద నీరు చేరినప్పటికీ అలాగే వాహనాలు నడుపుతూ  ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు వాహనదారులు. 

 

 

 

 

 

 ఇక హైదరాబాద్లోని మ్యాన్ హొల్స్  విషయానికి వస్తే... ఎక్కడికి తెరిచి ఉంటాయో... ఎక్కడ  మూసి  ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తం వరదనీరు తో మునిగిపోవడంతో తెరిచి ఉన్న మ్యాన్ హొల్స్   అటు ప్రజలకు ఇటు వాహనదారులకు కనిపించవు. దీంతో ఏం లేదులే అంతా సరిగ్గానే ఉంది కదా అని ముందుకు వెళితే మ్యాన్ హాల్లో పడి  మటాష్ అవ్వాల్సిందే. ముందే ఇప్పుడు మాయదారి ఫోన్లలో ముఖం పెడితే రోడ్డును కూడా చూడలేని  పరిస్థితి. ఫోన్లో ముఖం పెట్టి ఒక్క అడుగు ఆదమరిచి వేశారు అనుకోండి... ఇక మీ పరిస్థితి గోవిందా. ఇలా  నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజల కష్టాలు మాత్రం వర్ణనాతీతంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: